పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు ప్యాన్ ఇండియా లెవల్లో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. నిన్న మొన్నటి వరకు నంబర్ వన్ హీరోయిన్గా ఉన్న ఈ భామకు..ప్రభాస్‌తో నటించిన ‘రాధే శ్యామ్’ మూవీ నుంచి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది. ఈ సినిమా తర్వాత ‘బీస్ట్’,..‘ఆచార్య’ వరుసగా హాట్రిక్ ఫ్లాప్స్ అందుకుంది. దీంతో రాబోయే సినిమాలపై ఫుల్ ఫోకస్ పెట్టింది. (Photos/Pooja Hegde/Instagram)
పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం, హిందీ ఇలా భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తోంది. అంతేకాదు హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా ప్యాన్ ఇండియా లెవల్లో క్రేజీ ప్రాజెక్ట్స్‌లతో బిజీగా ఉంది. ఈ ఇయర్ ఈమె నటించిన సినిమాలు అంతగా సక్సెస్ కాకపోయినా.. ఈమె హవా మాత్రం తగ్గడం లేదు.(Photos/Pooja Hegde/Instagram) (Twitter/Photo)
దువ్వాడ జగన్నాథం మూవీ నుంచి వరుస సక్సెస్‌లతో ఉన్న ఈ భామ జైత్రయాత్రకు ప్రభాస్ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘రాధే శ్యామ్’ బ్రేకులు వేసింది. రాధే శ్యామ్’ బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైన ఈ సినిమాలో ప్రేరణగా పూజా హెగ్డే నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ చిత్రంలో డాక్టర్ ప్రేరణ పాత్రలో మంచి నటనే కనబరిచింది. ఈ సినిమా ఫెయిలైన ఆ తర్వాత విజయ్‌తో ‘బీస్ట్’ చిరంజీవి, రామ్ చరణ్‌ల ‘ఆచార్య’ సినిమాలు అంతగా నడవకపోయినా.. పూజా హెగ్డే క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. అంతేకాదు ఈ భామ ఇప్పటికే వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్‌తో ఫుల్లు బిజీగా ఉంది.(Photos/Pooja Hegde/Instagram)