అసలు ఇంత పెద్ద హీరోయిన్లు అలాంటి సినిమాలు చేసారా.. ఊరు పేరు తెలియని నటులతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారా అనిపిస్తుంది. తెలుగులో రకుల్, కాజల్, అనుష్క, తమన్నా, కీర్తి సురేష్.. ఇలా ఒక్కరేంటి చాలా మంది ముద్దుగుమ్మలు కెరీర్ మొదట్లో చిన్న సినిమాలు చేసారు. అవి ఇప్పుడు గానీ చూస్తే.. అసలు ఇందులో నటించింది వీళ్లేనా అనే అనుమానాలు వస్తుంటాయి.