పూజా హెగ్డే.. నాగచైతన్య 'ఒక లైలా కోసం'తో పరిచయమైన వరుణ్ తేజ్ సరసన 'ముకుంద' సినిమాలో నటించి తెలుగు వారికి మరింతగా దగ్గరైంది. ఆ తర్వాత వరుసగా తెలుగులో అవకాశాలుల అందిపుచ్చుకుంటూ ప్రస్తుతం తెలుగులో చాలా బీజీగా ఉన్న హీరోయిన్లో ఒకరుగా ఉన్నారు. తెలుగులో పూజ హెగ్డే వరుస సినిమాలతో .. వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఆమె ప్రస్తుతం అఖిల్‌కు జోడీగా 'మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్' సినిమా చేస్తోంది. (Instagram/Photo)
ఆ సినిమాతో పాటు పూజా ప్రభాస్ సరసన చేస్తున్న సినిమా రాధేశ్యామ్. ఈ సినిమా షూటింగ్ ముగింపు దశలో వుంది. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను రాధా కృష్ణ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో పూజ హెగ్డే మ్యూజిక్ టీచర్ గా కనిపించనుందట. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషాల్లో విడుదలకానుంది ఈ సినిమా. (Instagram/Photo)