Pooja Hegde - Rashmika Mandanna Pranitha Subhash | పూజా హెగ్డే, రష్మిక మందన్న ప్రస్తుతం సౌత్‌లో ముఖ్యంగా తెలుగులో స్టార్ హీరోయిన్స్‌గా సత్తా చూపెడుతున్నారు. తాజాగా వీళ్లిద్దరు ఇంట గెలిచి రచ్చ గెలుచే పనిలో పడ్డారు. వీళ్ల బాటలోనే మరో కన్నడ భామ కూడా బాలీవుడ్లో తన లక్ పరీక్షించుకుంది. (Instagram/Photo)
Rashmika Mandana -Pooja Hegde In Bollywood | సౌత్ హీరోయిన్స్ నార్త్‌లో నటించడం అనేది ఎప్పటి నుంచో ఉంది. అలనాటి వైజయంతి మాల, రేఖ, శ్రీదేవి, జయప్రద నుంచి ఇప్పటి తరం ఐశ్వర్యారాయ్, దీపికా పదుకొణే వరకు చాలా మంది భామలు సౌత్ నుంచి వెళ్లి నార్త్ (బాలీవుడ్)లో సత్తా చాటినవాళ్లే. ఇప్పటికే పూజా హెగ్డే బాలీవుడ్లో నటించింది. లేటెస్ట్గా రష్మిక మందన్న కూడా బాలీవుడ్ ‘మిషన్ మజ్ను’ సినిమాతో బాలీవుడ్లో లక్ పరీక్షించుకుంటోంది.
రీసెంట్గా రష్మిక మందన్న బాలీవుడ్లో ’టాప్ టక్కర్’ అనే ప్రైవేటు ఆల్బమ్‌తో బాలీవుడ్ ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది. ఈ ఫోటోలో తలపాగాతో రెండు చేతులు పెట్టి రష్మిక నవ్వుతూ ఉన్న ఫోటో ఇపుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. అంతేకాదు ఈ ఫోటోను సోషల్ మీడియాలో ఎక్కువ మంది లైక్ చేసిన ఫోటోగా రికార్డులకు ఎక్కింది. దీంతో రష్మిక గురించి బాలీవుడ్ ప్రేక్షకులు గూగుల్‌లో వెతకడం ప్రారంభించారు. (Rashmika mandanna Photo : Twitter)
రెజీనా కూడా ఇప్పటికే బాలీవుడ్లో ‘ఏక్ లడ్కీ కో దేఖాతో ఐసా లగా’ సినిమాతో తెరంగేట్రం చేసింది. అంతకు ముందు ‘ఆంఖే 2’ మూవీతో పరిచయం కావాల్సి ఉన్నా.. ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇపుడు వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తోన్న ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌తో మరోసారి బాలీవుడ్లో సత్తా చాటాలని చూస్తోంది. (Image: Regina Cassandra/instagram)
స్వతహాగా నార్త్ అమ్మాయి అయిన కాజల్ అగర్వాల్ 2004లో ‘క్యూ హో గయా నా’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ తర్వాత సౌత్‌లో నెంబర్ వన్ హీరోయిన్గా సత్తా చూపెట్టింది. ఇక అజయ్ దేవ్‌గణ్ ‘సింగం’ సినిమాతో బాలీవుడ్లో రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘స్పెషల్ 26’, ‘దో లబ్జోంకీ కహాని’ వంటి పలు బీ టౌన్ సినిమాల్లో నటించింది. (Twitter/Photo)