కేవలం తెలుగు మాత్రమే కాదు.. తమిళం, హిందీలోనూ పూజాకు అవకాశాలు వస్తున్నాయి. అన్ని భాషల్లోంచి వచ్చిన అవకాశాలను రెండు చేతులా అందిపుచ్చుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. కథలు నచ్చకపోతే కొన్ని సినిమాలను నిర్ధాక్షణ్యంగా నో చెప్తుంది కూడా. తెలుగులో ప్రస్తుతం మహేష్ బాబుతో పాటు మరికొందరు హీరోలతో కూడా నటిస్తూ బిజీగా ఉంది. (Instagram/Photo)
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజాహెగ్డే మాల్దీవులలో సేద తీరుతుంది. షూటింగ్‌లతో అలసిపోయిన ఈ అమ్మడు సముద్రతీరాన జలకాలాడుతోంది. వరుస భారీ సినిమాలతో షూటింగ్ పూర్తి చేసుకున్న ఆమె.. వెకేషన్ కోసం మాల్దీవులకు చేరుకుంది. తాజాగా కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తే సోషల్ మీడియా హీటెక్కింది. (Instagram/Photo)
టాప్ హీరోయిన్గా సత్తా చూపుతున్న ఈ భామ గతేడాది అఖిల్ హీరోగా నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో నటించింది.ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ అవ్వడమే కాదు.. అఖిల్‌కు గోల్డెన్ లెగ్‌లా మారింది. అది అలా ఉంటే పూజా హెగ్డే విజయ్ బీస్ట్ షూటింగ్‌ను పూర్తి చేసుకుని కొన్ని రోజులు పాటు విశ్రాంతి తీసుకోవడానికి మాల్దీవ్స్‌కు వెళ్లింది. అక్కడి అందాలను ఆస్వాదిస్తున్న ఫోటోలను షేర్ చేసింది.
పూజాహెగ్డే తన ఇన్‌స్టాగ్రామ్‌లో బికినీ ధరించి బ్రేక్‌ఫాస్ట్ ఎంజాయ్ చేస్తున్న కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఒక ఫోటోలో ఈమె స్విమ్మింగ్ పూల్ మధ్యలో అల్పాహారం తీసుకుంటూ కనిపించింది. ఇక టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా సత్తా చూపుతున్న ఈ భామ గతేడాది అఖిల్ హీరోగా నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో సత్తా చూపెట్టింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్‌ను రాబట్టి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో అఖిల్ మొదటి హిట్ అందుకున్నారు.