Pooja Hegde - Green India Challenge | టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ఇప్పటికే పలువురు స్టార్స్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం కొనియాడారు. తాజాగా సౌత్ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న పూజా హెగ్డే.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ఎంపీ సంతోష్ పిలపు మేరకు రామోజీ ఫిల్మ్ సిటీలో మొక్కలు నాటారు. (Twitter/Photo)
పూజా హెగ్డే.. ఈ యేడాది అఖిల్ హీరోగా నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీతో మరో సక్సెస్‌ను అందుకుంది. అంతేకాదు త్వరలో ప్రభాస్ హీరోగా నటించిన ‘రాధే శ్యామ్’ మూవీతో జనవరి 14న సంక్రాంతికి థియేటర్స్‌లో పలకరించనుంది. మరోవైపు చిరంజీవి, రామ్ చరణ్‌ల ఆచార్యలో నీలాంబరి పాత్రలో అలరించనుంది. (Twitter/Photo)