Pooja Hegde: టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం తెలుగుతో పాటు మిగతా సౌత్ భాషలతో పాటు బీటౌన్‌లో కూడా సత్తా చూపెడుతోన్న అతికొద్ది మందిలో హీరోయిన్స్‌లో ఈమె ఒకరు. రీసెంట్గా ఈ భామ వారణాసిలో కొలువైన కాశీ విశ్వేశ్వరుడికి, అన్నపూర్ణ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతేకాదు అక్కడ గంగా హారతి కార్యక్రమానికి హాజరయ్యారు. (Instagram/Photo)
సినీ ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు పైకెక్కుతూ తనంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది పూజా హెగ్డే. ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ బ్యూటీగా వరుసగా క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. తాజాగా ఈమె నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా హిట్టు కావాలని పూజలు చేసిందట. దాంతో పాటు అక్కడ జాతక దోష నివారణార్ధం కొన్ని అక్కడి పూజారులతో కలిసి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించినట్టు సమాచారం. Photo Credit: Pooja Hegde Instagram
పూజా హెగ్డే .. అఖిల్ హీరోగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ లో నటించింది. ఈ చిత్రాన్ని జి2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మించారు. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందించారు. ఇక పూజా ప్రస్తుతం ఈ సినిమాతో పాటు ప్రభాస్ సరసన ‘రాధే శ్యామ్’ సినిమాలో నటించింది. ఈ సినిమాను వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.(Twitter/Photo)
పూజాహెగ్డే తెలుగుతో పాటు హిందీలో సల్మాన్ ఖాన్ తో ‘కభీ ఈద్ కభీ దీవాలి’, రణ్వీర్ సింగ్‌తో ‘సర్కస్’ చేస్తోంది. మరోవైపు తమిళంలో విజయ్ సరసన ‘బీస్ట్’ సినిమాలో నటిస్తోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాలో ఈమెనే తీసుకున్నట్టు సమాచారం. ఇంకోవైపు అల్లు అర్జున్ ..‘ఐకాన్’లో ఈమెనే నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. (Instagram/Photo)