పూజా హెగ్డే (Pooja Hegde).. నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత వరుణ్ హీరోగా పరిచయమైన ‘ముకుందా’ సినిమాలో గోపికమ్మ పాటతో ఈ భామ క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం అగ్ర హీరోల బెస్ట్ ఆప్షన్‌గా నిలిచిన పూజా హెగ్డే వరుస సినిమాలతో దూసుకుపోతుంది.(Image Credit : Instagram)
పూజా హెగ్డే మాతృభాష తులు అయితే ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, కొద్దిగా కన్నడ, తమిళ్ కూడా మాట్లాడగలదు. అంతేకాదు పూజా భారతనాట్యంలో కూడా శిక్షణ పొందింది. ముంబై లోని ఎంఎంకే కాలేజ్‌లో కామర్స్ లో ఉన్నత చదివిన ఈ సుందరి. ఇంటర్ కాలేజ్ ప్రోగ్రామ్స్ లో, డాన్స్ షోస్ లో ఇంకా ఫ్యాషన్ షోలో పాల్గొనేది.(Image Credit : Instagram)
పూజా మిస్ ఇండియా పోటీలలో 2009 లో పాల్గొన్నా మొదటి రౌండ్స్ లోనే ఎలిమినేట్ అయిపోయింది. అయితే 2010 లో విశ్వసుందరి పోటీలకు భారతదేశం నుంచి ఎంపిక కోసం జరిగిన అందాల పోటీల్లో రెండో స్థానంలో నిలిచింది. బిర్యానీ, పిజ్జా లను ఎక్కువగా ఇష్టపడే పూజ కనీసం రోజూ రెండు గంటలు యోగా, వర్కౌట్స్ కు కేటాయిస్తుంది. తన బరువును ఎప్పుడు కంట్రోల్ లో ఉంచుకొనే ఈ బ్యూటీ బరువు 53 కేజీలు మరియు ఎత్తు 5 అడుగుల 9 అంగుళాలు. (Image Credit : Instagram)
క్రికెటర్ రాహుల్ ద్రావిడ్, టెన్నిస్ స్టార్ రోజెర్ ఫెదరర్ ను ఆరాధించే పూజా ఏ ఆర్ రెహ్మాన్ సంగీతానికి, జెన్నిఫర్ లోపెజ్ పాటలకు పిచ్చ ఫ్యాన్. ఇంకా హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ సినిమా పరంగా ఎక్కువగా ఇష్టపడుతుంది. ఖాళీ సమయాలలో డాన్స్, పుస్తకాలు చదవడం, ట్రావెలింగ్ ఎక్కువగా చేసే పూజా పెడ్రో అనే కుక్కను కూడా పెంచుతోంది. ఖాళీ దొరికినప్పుడు మూగ జీవాలకు సేవ కూడా చేస్తుంటుంది. (Image Credit : Instagram)
ఖరీదయిన వస్తువులు, బట్టల్ని ఇష్టపడే పూజా ఎక్కువగా షాపింగ్ చెయ్యదు, కానీ చేస్తే తన టేస్ట్ కు తగ్గట్టు అన్నీ కోనేస్తుంది. అయితే ఎప్పుడూ ఫ్యాషన్ గా ఉండడానికే ఇష్టపడుతుంది. పూజా తండ్రి మంజునాధ్ హెగ్డే వ్యాపార వేత్త. తల్లి లత హెగ్డే క్యూ నెట్ వర్క్ మార్కెటింగ్ బిజినెస్ నిపుణురాలు. దాంతో చిన్నప్పటి నుంచి నెట్ వర్క్ మార్కెటింగ్ లో పూజా మెళుకువలు బానే అలవర్చుకుంది. (Image Credit : Instagram)
ప్రస్తుతం వరుసగా భారీ చిత్రాలతో బిజీగా ఉన్న పూజా హెగ్డే, ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బాలీవుడ్లో ఆమె నటించిన `మొహెంజోదారో` సినిమాపై షాకింగ్ కామెంట్లు చేశారు. తన కెరీర్లోనే చెత్త సినిమాగా వర్ణించి షాకిచ్చింది. ఈ చిత్రంలో ఆమె హృతిక్ రోషన్ సరసన నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా తనకు ఐరన్ లెగ్ ముద్ర వేసిందని చెప్పింది. (Image Credit : Instagram)
ప్రస్తుతం పూజా హెగ్డే.. మహేష్‌బాబుతో త్రివిక్రమ్ సినిమా చేస్తుంది. దీంతోపాటు విజయ్ దేవరకొండతో `జనగణమన` సినిమాలో నటిస్తుంది. ఇది శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. అలాగే పవన్‌తో ఫస్ట్ టైమ్ `భవదీయుడు భగత్ సింగ్` చిత్రంలో నటించబోతుంది. అలాగే హిందీలో సల్మాన్ తో `కభీ ఈద్ కభీ దివాళీ` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. (Image Credit : Instagram)