ఈ భామకు ప్రస్తుతం అంత బ్యాడే జరుగుతోంది. ఈ మధ్య పూజా హెగ్డే పరిస్థితి ఏం బాగాలేదు. ఆమె నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్స్ అవుతున్నాయి. రాధేశ్యామ్ మొదలుకొని, ఆ తర్వాత వచ్చిన బీస్ట్, ఆచార్య ఇలా వరుసగా బాక్సాఫీస్ దగ్గర తుస్సుమంటున్నాయి. దీంతో తెలుగులో అవకాశాలు తగ్గాయి.. పరిస్థితేమి బాగాలేదు.. Photo : Twitter
వరుస పరాజయాలు వస్తున్నాయి. ఆమె తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించిన చిత్రాలు వరుసగా నిరాశపరిచాయి. ప్రస్తుతం మహేష్, త్రివిక్రమ్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాపైనే ఆశలన్ని పెట్టుకుంది. అది అలా ఉంటే ఈ భామకు మరో తమిళ అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. తమిళంలో పదేళ్ల క్రితం నటించిన తొలి చిత్రం ముగమూడి ఇటీవల నటించిన బీస్ట్ చిత్రం పూజాహెగ్డేకు అపజయాలనే అందించాయి.. Photo : Twitter
దర్శకుడు లింగుసామి డైరెక్షన్లో ఇంతకుముందు సంచలన విజయం సాధించిన పైయ్యా తెలుగులో (అవారా) చిత్రానికి సీక్వెల్‌ను తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడు. పైయ్యా చిత్రంలో నటుడు కార్తీ, తమన్నా జంటగా నటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా సీక్వెల్లో నటుడు ఆర్య నటిస్తుండగా.. ఆమెకు జోడిగా మొదట జాన్వీకపూర్ అనుకున్నారు. ఇక లేటెస్ట్గా ఈ పాత్రలో పూజాహెగ్డే నటిస్తుందని తెలుస్తోంది. చూడాలి మరి ఈ సినిమాతోనైనా ఈ భామకు హిట్ దక్కేనా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.. Photo : Instagram
ఇక అది అలా ఉంటే పూజా హెగ్డే ఆ సినిమా దర్శకుడు త్రివిక్రమ్‌పై అలిగినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూజా హెగ్డే గతంలో అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురంలో.. వంటి సినిమాలను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసింది. ఆ రెండు సినిమాలు కూడా ఆమెకు మాంచి పాపులారిటీని తెచ్చాయి. స్టార్ హీరోయిన్గా నిలబెట్టాయి. ఇక ప్రస్తుతం ఈ భామ మహేష్ సరసన మరోసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోంది. Photo : Instagram
అయితే ఈసినిమా విషయంలో పూజా హెగ్డే సంతృప్తిగా లేదట. ముఖ్యంగా తన రోల్ విషయంలో ఆమె కొంత అసంతృప్తిగా ఉన్నట్లు టాక్ నడుస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. ఒకరు పూజా హెగ్డే కాగా.. మరోకరు శ్రీలీల. అయితే ఈ సినిమాలో పూజా హెగ్డేతో పాటు శ్రీలీలకు మంచి పాత్ర ఉంటుందట. చెప్పాలంటే ఈ సినిమాలో ఎవరు సెకండ్ హీరోయిన్ అనేది ఉండదట. ఇద్దరికీ మంచి రోల్స్ ఉంటాయట. ఈ నేపథ్యంలో సీనియర్ హీరోయిన్ అయిన తనకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న రోల్ ఇవ్వలేదని అలిగిందట. Photo : Instagram
పూజా హెగ్డేకు వరుసగా ఫ్లాప్స్ పడుతున్నాయి. ఆచార్య, బీస్ట్, రాధేశ్యామ్, తాజాగా హిందీ సర్కస్ ఇలా వరుసగా ఆమె చేసిన అన్ని సినిమాలు పోతున్నాయి. ఈ నేపథ్యంలో తనకు మంచి రోల్ పడితే మరోసారి ట్రాక్‌లోకి రావోచ్చని భావిస్తే.. దర్శకుడు త్రివిక్రమ్ ఇద్దరికి సమానమైన స్థాయిలో రోల్స్ ఇవ్వడంతో అలిగిందని ఓ రూమర్ వైరల్ అవుతోంది. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో.. Photo : Instagram
ఇక మరోవైపు వరుస పరాజయాలతో నిరాశ చెందుతోన్న ఈ భామ ప్రస్తుతం వేదాంతం మాట్లాడుతోంది.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పూజా మాట్లాడుతూ.. జీవితంలో ఏదీ మన చేతిలో ఉండదని.. చేసిన పనికి ఏలాంటీ ఫలితం వచ్చినా అంగీకరించాల్సిందే.. చేసేందేం లేదు. కొన్ని నిర్ణయాలు మన చేతిలో ఉండవని అంటోంది. మనం తీసుకున్న నిర్ణయాల వల్ల పరజయాలు రావోచ్చు.. అంత మాత్రాన తీసుకున్న నిర్ణయం తప్పని భావించకూడదని తెలిపింది. Photo : Instagram
ఈ భామ భవదీయుడు భగత్ సింగ్‌లో హీరోయిన్గా చేయాల్సి ఉంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణం. అన్ని అనుకున్నట్లు జరిగితే.. ఈ సమయానికి ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి కావాల్సి ఉండేది. కాగా ఈ సినిమా వరుసగా వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఈ సినిమాకు కేటాయించిన డేట్స్‌ను ఏం చేయాలో తెలియక ఫ్యామిలీతో వెకేషన్ కోసం వాడేసిందట. Photo : Instagram
ఇక మరోవైపు లైగర్ తర్వాత విజయ్, పూరీలు జనగణమన అనే సినిమా చేయాల్సి ఉంది. అంతేకాదు పూజా హేగ్డే ఇందులో హీరోయిన్ కావడంతో ఆమెతో ఓ షెడ్యూల్ కూడా షూట్ చేశారట, కాగా ఈ సినిమా ఏకంగా క్యాన్సల్ అయ్యింది. ఇలా ఒకవైపు చేసిన సినిమాలు సరిగ్గా ఆడక, మరోవైపు ఇచ్చిన డేట్స్ వేస్ట్ అవ్వడంతో చాలా అప్ సెట్లో ఉంది పూజా.. ఇక ఈ భామ తెలుగులో మహేష్ సరసన త్రివిక్రమ్ సినిమాలో నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోంది. దీంతో పాటు హిందీలో ఓ రెండు చిత్రాల్లో నటిస్తోంది. Photo : Instagram
పూజా హెగ్డే.. నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత వరుణ్ హీరోగా పరిచయమైన ‘ముకుందా’ సినిమాలో గోపికమ్మ పాటతో ఈ భామ క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం అగ్ర హీరోల బెస్ట్ ఆప్షన్‌గా నిలిచిన పూజా హెగ్డే త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అల వైకుంఠపురములో’ సినిమాతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. Photo : Instagram
ఇక అది అలా ఉంటే పూజా హెగ్డే నటించిన ఆచార్య సినిమా 2022 ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. పూజా హీరోయిన్గా చేసిన గత రెండు సినిమాలు సరిగా అలరించలేదు. పూాజా నటించిన రాధేశ్యామ్, బీస్ట్ రెండు సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర ఆకట్టుకోలేదు. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే, రామ్ చరణ్‌కు జోడిగా నీలాంబరి పాత్రలో మెరిశారు. ఆచార్య సినిమా సినిమా కూడా ఆకట్టుకోలేకపోయింది. Photo : Twitter
చిరంజీవి (Chiranjeevi ), రామ్ చరణ్ (Ram Charan)లు తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి నటించిన సినిమా కావడం వల్ల ‘ఆచార్య’ (Acharya)పై మంచి అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు అపజయం ఎరుగని దర్శకుడు కొరటాల శివ(Koratala Siva) డైరెక్షన్లో రావడం కూడా అంచనాలను రెట్టింపు చేసింది. అయితే ఈ సినిమాకు మొదటి షోనుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది. సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేదని, గ్రాఫిక్స్ చెత్తగా ఉన్నాయని.. ఇద్దరూ స్టార్స్ ఉన్నా సినిమా ఎక్కడా కనెక్ట్ అవ్వడం లేదని టాక్ వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, తమిళంలో స్ట్రీమింగ్ అవుతోంది.. Photo : Instagram.
‘ఆచార్య’ మంచి అంచనాల నడుమ ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. రామ్ చరణ్ (Ram Charan) సిద్ద పాత్రలో కనిపించగా.. ఆయనకు జోడిగా పూజా హెగ్డే (Pooja Hegde) నటించారు. చిరంజీవికి జోడిగా కాజల్‌లు తీసుకున్నారు. అంతేకాదు కొన్ని రోజుల షూటింగ్ తర్వాత ఆమె పాత్రను తొలగించినట్లు ఇటీవల దర్శకుడు క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో హీరోయిన్ రెజీనా మెగాస్టార్‌తో ఆడిపాడింది. Photo : Instagram
పూజా హెగ్డే మాతృభాష తులు అయితే ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, కొద్దిగా కన్నడ, తమిళ్ కూడా మాట్లాడగలదు. అంతేకాదు పూజా భారతనాట్యంలో కూడా శిక్షణ పొందింది. ముంబై లోని ఎంఎంకే కాలేజ్‌లో కామర్స్ లో ఉన్నత విద్య చదివిన ఈ సుందరి. ఇంటర్ కాలేజ్ ప్రోగ్రామ్స్ లో, డాన్స్ షోస్ లో ఇంకా ఫ్యాషన్ షోలో పాల్గొనేది. (Instagram/Photo)
పూజా మిస్ ఇండియా పోటీలలో 2009 లో పాల్గొన్నా మొదటి రౌండ్స్ లోనే ఎలిమినేట్ అయిపోయింది. అయితే 2010 లో విశ్వసుందరి పోటీలకు భారతదేశం నుంచి ఎంపిక కోసం జరిగిన అందాల పోటీల్లో రెండో స్థానంలో నిలిచింది. బిర్యానీ, పిజ్జా లను ఎక్కువగా ఇష్టపడే పూజ కనీసం రోజూ రెండు గంటలు యోగా, వర్కౌట్స్ కు కేటాయిస్తుంది. తన బరువును ఎప్పుడు కంట్రోల్ లో ఉంచుకొనే ఈ బ్యూటీ బరువు 53 కేజీలు మరియు ఎత్తు 5 అడుగుల 9 అంగుళాలు. (Instagram/Photo)
క్రికెటర్ రాహుల్ ద్రావిడ్, టెన్నిస్ స్టార్ రోజెర్ ఫెదరర్ ను ఆరాధించే పూజా ఏ ఆర్ రెహ్మాన్ సంగీతానికి, జెన్నిఫర్ లోపెజ్ పాటలకు పిచ్చ ఫ్యాన్. ఇంకా హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ సినిమా పరంగా ఎక్కువగా ఇష్టపడుతుంది. ఖాళీ సమయాలలో డాన్స్, పుస్తకాలు చదవడం, ట్రావెలింగ్ ఎక్కువగా చేసే పూజా పెడ్రో అనే కుక్కను కూడా పెంచుతోంది. ఖాళీ దొరికినప్పుడు మూగ జీవాలకు సేవ కూడా చేస్తుంటుంది. (Instagram/Photo)
ఖరీదయిన వస్తువులు, బట్టల్ని ఇష్టపడే పూజా ఎక్కువగా షాపింగ్ చెయ్యదు, కానీ చేస్తే తన టేస్ట్ కు తగ్గట్టు అన్నీ కోనేస్తుంది. అయితే ఎప్పుడూ ఫ్యాషన్ గా ఉండడానికే ఇష్టపడుతుంది. పూజా తండ్రి మంజునాధ్ హెగ్డే వ్యాపార వేత్త. తల్లి లత హెగ్డే క్యూ నెట్ వర్క్ మార్కెటింగ్ బిజినెస్ నిపుణురాలు. దాంతో చిన్నప్పటి నుంచి నెట్ వర్క్ మార్కెటింగ్ లో పూజా మెళుకువలు బానే అలవర్చుకుంది. (Twitter/Photo)