Pooja Hegde: నేను రెడీ.. మీరు రెడీయా అంటున్న పూజా హెగ్డే..
Pooja Hegde: నేను రెడీ.. మీరు రెడీయా అంటున్న పూజా హెగ్డే..
Pooja Hegde: 150 రోజులు దాటిపోయింది షూటింగ్స్ ఆపేసి.. ఇప్పటికీ ఇంకా మొదలు పెట్టలేదు. అక్కడక్కడా చిన్న సినిమాలు మొదలైనా కూడా పెద్ద వాళ్లు మాత్రం ఇంకా అడుగు బయటికి పెట్టడం లేదు.
150 రోజులు దాటిపోయింది షూటింగ్స్ ఆపేసి.. ఇప్పటికీ ఇంకా మొదలు పెట్టలేదు. అక్కడక్కడా చిన్న సినిమాలు మొదలైనా కూడా పెద్ద వాళ్లు మాత్రం ఇంకా అడుగు బయటికి పెట్టడం లేదు.
2/ 7
ఎప్పుడు ఎలాంటి వార్తలు వినాల్సి వస్తుందో.. కరోనా ఎక్కడ్నుంచి దాడి చేస్తుందో తెలియక అంతా ఇంటికే పరిమితం అయిపోయారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నట్లు బతికుంటే బలిసాకు తిందాంలే అన్నట్లు చాలా మంది ఇంటి నుంచి బయటికి రావడం లేదు.
3/ 7
డిసెంబర్ తర్వాతే షూటింగ్స్ అంటున్నారు స్టార్ హీరోలు అయితే. కరోనా పోయేంత వరకు కూడా మేం బయటికి రామంతే అంటూ భీష్మించుకు కూర్చున్నారు. దాంతో పెద్ద సినిమాల షూటింగ్స్ అన్నీ అలాగే ఆగిపోయాయి.
4/ 7
అక్కడక్కడా ఒకరిద్దరు బయటికి వస్తున్నా కూడా కరోనా అటాక్ చేస్తుండటంతో వాళ్లు వెంటనే క్వారంటైన్ అంటున్నారు. దాంతో షూటింగ్ అనేది మరిచిపోతున్నారు సినిమా వాళ్లు. ఈ క్రమంలోనే పూజా హెగ్డే ముందుకొచ్చింది.
5/ 7
తాను షూటింగ్స్ చేసుకోడానికి రెడీ.. మీరు రెడీయా అని సవాల్ చేస్తుంది. ప్రస్తుతం ఈ భామ చేతిలో రెండు క్రేజీ సినిమాలున్నాయి. ప్రభాస్ హీరోగా వస్తున్న రాధే శ్యామ్‌తో పాటు అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా కూడా ఉంది.
6/ 7
ఈ రెండు సినిమాల్లో ఏది సెట్స్‌పైకి వచ్చినా తాను కాల్షీట్ ఇవ్వడానికి.. షూటింగ్‌కు రావడానికి సిద్ధమే అంటుంది పూజా. ప్రస్తుతం పూజా హెగ్డే బెంగళూరులో తన తల్లిదండ్రులతో కలిసి ఉంది. లాక్ డౌన్ మొదలైనప్పట్నుంచి ఈ క్షణం వరకు ఆమె బయటకు రావట్లేదు.
7/ 7
పూర్తిగా ఇంటికే పరిమితమైంది. దాంతో ఇప్పుడు షూటింగ్స్ చేయడానికి తను మానసికంగా.. శారీరకంగా కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. మరి పూజా సిద్ధంగానే ఉన్నా.. మన దర్శక నిర్మాతలు, హీరోలు సిద్ధంగా ఉంటారా లేదా అనేది చూడాలి.