Pooja Hegde: తెలుగులో ప్రస్తుతం ప్రభాస్, రాధాకృష్ణ కుమార్ సినిమాలో నటిస్తుంది పూజా. ఈ సినిమాతో పాటు అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలోనూ ఈమె హీరోయిన్.
ఒక్కోసారి టైమ్ అలా వస్తుందంతే. కెరీర్ మొదలు పెట్టిన కొత్తలో ఒక్క విజయం అంటూ చాలా ఏళ్లు వేచి చూసింది పూజా హెగ్డే. ఇప్పుడు మాత్రం వద్దన్నా విజయాలు వస్తున్నాయి. దాంతో ఈమెకు డిమాండ్ కూడా బాగా పెరిగిపోయింది.
2/ 10
తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ అరవింద సమేత సినిమాతో తొలి విజయం అందుకున్న పూజాహెగ్డే.. మహేష్ బాబు మహర్షితో మరో విజయం కాని విజయం అందుకుంది. ఈ సినిమా 100 కోట్లకు పైగా షేర్ సాధించింది.
3/ 10
గద్దలకొండ గణేష్.. ఈ ఏడాది విడుదలైన అల వైకుంఠపురములో సినిమాలు కూడా హిట్ కావడంతో అమ్మడి రేంజ్ పెరిగిపోయింది.
4/ 10
తెలుగులో ప్రస్తుతం ప్రభాస్, రాధాకృష్ణ కుమార్ సినిమాలో నటిస్తుంది పూజా. ఈ సినిమాతో పాటు అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలోనూ ఈమె హీరోయిన్. ఈ రెండు సినిమాలకు కూడా 1.4 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకుంటుంది పూజా.
5/ 10
అల వైకుంఠపురములో కంటే ముందు ఒప్పుకున్న సినిమాలకు కోటి.. కోటిన్నర మధ్యలోనే తీసుకుంది పూజా.
6/ 10
అప్పట్లో సాక్ష్యం సినిమా కోసం కోటి 60 లక్షలకు పైగానే పారితోషికం అందుకుంది పూజా హెగ్డే. ఇప్పుడు ఒక్కో సినిమాకు 2 కోట్లకు పైగానే డిమాండ్ చేస్తుంది ఈమె.
7/ 10
వరసగా స్టార్ హీరోల నుంచి అవకాశాలు వెతుక్కుంటూ మరీ వస్తుండటంతో కొండెక్కి అస్సలు దిగడం లేదు పూజా. ఈమె డేట్స్ కావాలంటే రేట్ చెప్పినంత ఇచ్చుకోవాల్సిందే.
8/ 10
ప్రస్తుతం తెలుగులో సినిమాలేవీ ఒప్పుకోవడం లేదు ఈ బ్యూటీ. త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమాలో పూజానే తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నా రేట్ మరీ ఎక్కువైపోతుందని ఆలోచనలో పడ్డారు నిర్మాతలు.
9/ 10
ఇదిలా ఉంటే ఇప్పుడు తన రేట్‌తో బాలీవుడ్ నిర్మాతలకు కూడా హార్ట్ ఎటాక్ తెప్పిస్తుంది పూజా హెగ్డే. తాజాగా ఈ అమ్మడు బాలీవుడ్లో సల్మాన్ ఖాన్‌తో కబీ ఈద్ కబీ దివాళీ సినిమాలో నటించబోతుంది. ఈ సినిమాకు గానూ ఏకంగా 4 కోట్ల పారితోషికం డిమాండ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
10/ 10
మొదట్లో నిర్మాత నిర్మాత సాజిద్ నడియావాలా కాస్త ఆలోచించినా కూడా ఆమె క్రేజ్ దృష్టిలో ఉంచుకుని ఇవ్వడానికి ఒప్పుకున్నాడని తెలుస్తుంది. మొత్తానికి సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వెళ్లిపోతుంది పూజా హెగ్డే.