అది అలా ఉంటే ఈ బుట్టబొమ్మ పూజాహెగ్డే ప్రస్తుతం ఇటు తెలుగుతో పాటు అటు హిందీ తమిళ భాషాల్లో నటిస్తూ... ఇండియాలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో ఈ బ్యూటీకి భారీ క్రేజ్ ఉంది. తమిళ్’లో పూజా తలపతి విజయ్ సరసన “బీస్ట్” లో నటిస్తోంది. మరోవైపు హిందీలో సర్కస్, బాయిజాన్ వంటి సినిమాల్లో నటిస్తోంది. Photo : Twitter
ఇక తాజాగా మరో తెలుగు సినిమాలో ఈ పూజా హెగ్డే నటిస్తున్నట్లు తెలుస్తోంది. నితిన్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వం వస్తున్న సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్గా తీసుకున్నారు. ఈ సినిమాకు పూజ ఏకంగా మూడు కోట్లకు పైగా డిమాండ్ చేసిందట. అయితే అంత డిమాండ్ చేసిన నిర్మాతలు ఓకే అన్నారట. దీంతో ఈ సినిమాకు పూజాకు ఏకంగా రూ.3.5 కోట్లు అందనుందని తెలుస్తోంది. ఈ వార్తలు గనుక నిజమైతే దక్షిణాదిన భారీ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్లలో పూజాహెగ్డే కూడా చేరిపోతుంది. Photo : Twitter