Pooja Hegde: కాటుక కళ్లతో ఫ్యాన్స్‌‌ను కనికట్టు చేస్తోన్న పూజా హెగ్డే.. బుట్ట బొమ్మ న్యూ లుక్‌కు అభిమానులు ఫిదా..

Pooja Hegde: పూజా హెగ్డేను తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కరలేదు. పూజా నాగచైతన్య ఒక లైలాకోసంతో పరిచయమై.. ఆ తర్వాత వరుసగా ఆఫర్స్ అందుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ భామ ప్రస్తుతం ప్రభాస్ సరసన రాధేశ్యామ్’లో నటిస్తోంది. దీంతో పాటు అఖిల్‌తో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్‌లోను నటిస్తోంది. ఇక చిరంజీవి ఆచార్య మూవీలో రామ్ చరణ్ సరసన యాక్ట్ చేస్తోంది. ఈ యేడాది మూడు సినిమాలతో పలకరించబోతుంది.