రాధే శ్యామ్’ బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైన ఈ సినిమాలో ప్రేరణగా పూజా హెగ్డే నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ చిత్రంలో డాక్టర్ పాత్రలో మంచి నటనే కనబరిచింది. ఈ సినిమా ఫెయిలైన త్వరలో రాబోయే ‘బీస్ట్’, ‘ఆచార్య’తో పాటు పలు బాలీవుడ్... ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో ఫుల్ బిజీగా ఉంది. ఇక ఈమె నటించిన ‘బీస్ట్’ మూవీ మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. ఈ సినిమాపై పూజా హెగ్డే భారీ ఆశలే పెట్టుకుంది. అంతేకాదు రాధే శ్యామ్‌తో వచ్చిన ఫ్లాప్‌ను ఈ సినిమా సక్సెస్‌తో పోగొట్టాలని చూస్తోంది. (Instagram/Photo)
తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడూ బిజీగా ఉండే హీరోయిన్లలో పూజా హెగ్డే అందరికంటే ముందుంటుంది. ఎందుకంటే గత మూడేళ్ళుగా వరస సినిమాలు చేస్తూనే ఉంది పూజా. ఇప్పటికే ‘రాధే శ్యామ్’ మూవీతో పలకరించింది. బీస్ట్ మూవీ మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. ఇక ఈమె నటించిన ‘ఆచార్య’సర్కస్, రాధే సినిమాలు ఈ యేడాదే ప్రేక్షకులు ముందుకు రానుంది. Pooja hegde Instagram
కేవలం తెలుగు మాత్రమే కాదు.. తమిళం, హిందీలోనూ పూజాకు అవకాశాలు వస్తున్నాయి. అన్ని భాషల్లోంచి వచ్చిన అవకాశాలను రెండు చేతులా అందిపుచ్చుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. కథలు నచ్చకపోతే కొన్ని సినిమాలను నిర్ధాక్షణ్యంగా నో చెప్తుంది కూడా. తెలుగులో ప్రస్తుతం మహేష్ బాబు,త్రివిక్రమ్ సినిమాతో మరికొందరు హీరోలతో కూడా నటిస్తూ ప్యాన్ ఇండియా హీరోయిన్గా ఫుల్లు బిజీగా ఉంది. (Instagram/Photo)
టాప్ హీరోయిన్గా సత్తా చూపుతున్న ఈ భామ గతేడాది అఖిల్ హీరోగా నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో నటించింది.ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ అవ్వడమే కాదు.. అఖిల్‌కు గోల్డెన్ లెగ్‌లా మారింది. అది అలా ఉంటే పూజా హెగ్డే విజయ్‌తో నటించిన బీస్ట్ సినిమాలోని సాంగ్స్ సోషల్ మీడియాలను షేక్ చేస్తోంది. ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. (Instagram/Photo)
ముంబై లోని ఎంఎంకే కాలేజ్‌లో కామర్స్ లో ఉన్నత విద్య చదివిన ఈ సుందరి. ఇంటర్ కాలేజ్ ప్రోగ్రామ్స్ లో, డాన్స్ షోస్ లో ఇంకా ఫ్యాషన్ షోలో పాల్గొనేది. బిర్యానీ, పిజ్జా లను ఎక్కువగా ఇష్టపడే పూజ కనీసం రోజూ రెండు గంటలు యోగా, వర్కౌట్స్ కు కేటాయిస్తుంది. తన బరువును ఎప్పుడు కంట్రోల్ లో ఉంచుకొనే ఈ బ్యూటీ బరువు 53 కేజీలు,ఎత్తు 5 అడుగుల 9 అంగుళాలు (Instagram/Photo)