మణిరత్నం మార్క్ పోయెటిక్ టచ్ ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపిస్తోంది. కొంత ఆలస్యమైనా పీఎస్ 1 ట్రైలర్ ఆకట్టుకుంది. యువరాజు ఆదిత్య కరికాలన్ నుండి సందేశాన్ని అందించడానికి చోళ రాజ్యానికి వెళ్లిన వంతీయతేవన్ చుట్టూ కథాంశం తిరుగుతుంది. విక్రమ్ ఆదిత్య కరికాలన్ గా నటించగా .. యోధ యువరాజు వల్లవరైయన్ వంతీయతేవన్ గా కార్తీ నటించారు
ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో తమిళ నటుడు విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష కనిపించనున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్టర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ బ్యానర్ పై మణిరత్నం, సుభాష్ కరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్.రవి వర్మన్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. అక్కినేని శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ చేస్తున్నారు.Photo : Twitter
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఇది 10వ శతాబ్దంలో చోళరాజుల కాలానికి సంబంధించిన కథ అని తెలుస్తోంది. ఆ కాలంలో జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటనను ఆధారంగా చేసుకుని దాని చుట్టూ అల్లుకున్న కథ ఇదని అంటున్నారు. ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళీ భాషల్లో విడుదలకానుంది.Photo : Twitter