బాక్స్ ఆఫీస్ దగ్గర మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ పొన్నియన్ సెల్వన్ 1 అదిరే కలెక్షన్స్‌తో కేక పెట్టిస్తోంది. ఈ పొన్నియన్ సెల్వన్ 1 సినిమా తెలుగు సహా మిగతా భాషల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన.. తమిళంలో మాత్రం దుమ్ము లేపింది. వాళ్లు బాహుబలిలా ఈ సినిమాను ఓ బాధ్యతలా చూసి హిట్ చేసారు. ( Photo : Twitter)
పొన్నియన్ సెల్వన్.. ఈ యేడాది తమిళ్ నుంచి విడుదలై భారీ సినిమాల్లో ఒకటి. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా అనుకున్న విధంగా బాగానే ఆకట్టుకుంది. అయితే తెలుగులో మాత్రం పెద్దగా ఆదరణ పొందలేదు. దీనికి ఆ తమిళ నేటీవిటీ ప్రధాన కారణమని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఈ సినిమా తెలుగులో అనుకున్న రేంజ్లో ఆకట్టుకోలేదు. అయితే అటు తమిళంలో మాత్రం మంచి వసూళ్లను రాబట్టింది. Photo : Twitter
చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి అలాగే ఐశ్వర్య రాయ్, త్రిష లాంటి భారీ కాస్ట్ తో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించారు. ఈ సినిమా ఇప్పటికే తమిళ్ బాగానే రన్ అవుతోంది. ఇక ఈ చిత్రం ఇప్పుడు ప్రముఖ ఓటిటిలో గత వారం పే ఫర్ వ్యూ పద్ధతిన ఉంచారు. యితే ఇది ప్రస్తుతానికి అందరికీ అందుబాటులో లేదు. రెంటల్ రూపంలో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమాను చూడాలనుకుంటే ప్రైమ్ మెంబర్స్ అయినా కూడా అదనంగా 200 చెల్లించాలి. తాజాగా ఈ సినిమా నేటి నుంచి ప్రైమ్ మెంబర్స్ అందరికి అందుబాటులోకి వచ్చింది. ఇక ఎవరు కూడా ఈ సినిమాను పే ఫర్ వ్యూ పద్ధతిన చూడకపోవడంతో ఈ సినిమాను నేటి నుంచి సబ్ స్క్రబర్స్‌ను మాములుగా అందుబాటులో ఉంచింది అమెజాన్ ప్రైమ్. Photo : Twitter
ఈ సినిమాలో ముఖ్యపాత్రలో విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష నటించారు. ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగు సహా ప్యాన్ ఇండియా లెవల్లో భారీగా విడుదల చేస్తున్నారు. తెలుగులో ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) విడుదల చేశారు. ఇక ఈ కథ విషయానికి వస్తే.. ఇది పూర్తిగా తమిళ నేటీవిటిగా చెందిన కథ.. ఆ పేర్లు.. అవి.. అంత తమిళ పేర్లు అవ్వడంతో తెలుగు వారికి కనెక్టివిటీ కాలేదు. Photo : Twitter
కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియన్ సెల్వన్ (Ponniyin Selvan - 1) నవల ఆధారంగా మణిరత్నం ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాను (Ponniyin Selvan - 1) తెరకెక్కించడం తన లైఫ్ టైమ్ డ్రీమ్ అంటూ మణిరత్నం ప్రకటించారు. బాహుబలి ఇచ్చిన సక్సెస్‌తో మణి రత్నం ఈ భారీ ప్రాజెక్ట్ చేపట్టారు. ఈ సినిమాను ఎక్కువగా రియల్ లోకేషన్స్‌లో చిత్రీకరించారు. Photo : Twitter
లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో, విక్రమ్ (Vikran) .. కార్తి (Karthi) .. జయం రవి (Jayam Ravi) .. శరత్ కుమార్ .. పార్తీబన్ .. ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai) .. త్రిష (Trisha).. ఐశ్వర్య లక్ష్మి ప్రధానమైన పాత్రలను పోషించారు. ఏఆర్ రెహ్మాన్ (AR Rahman)గీతాన్ని సమకూర్చారు. Photo : Twitter
Ponniyin Selvan: మణిరత్నం ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పొన్నియన్ సెల్వన్ సెప్టెంబర్ 30న రిలీజ్ అయ్యింది. ఈ సినిమా తెలుగు, హిందీ సహా మిగతా భాష ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేకపోయినా.. తమిళనాడులో మాత్రం రికార్డులు క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ చిత్రం ఖాతాలో మరో రికార్డు నమోదు అయింది. ఈ చిత్రం ఓవరాల్‌గా రూ. 500 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. Ponniyin selvan 1 collections Twitter
విక్రమ్, ఐశ్వర్యరాయ్, జయం రవి, కార్తి, త్రిష,శరత్ కుమార్, జయరామ్, ప్రకాష్ రాజ్,ప్రభు, విక్రమ్ ప్రభు వంటి భారీ స్టార్ కాస్ట్‌తో నిర్మించిన ఈ చిత్రాన్ని తమిళ చోళ రాజ్యానికి సంబంధించిన కథ కావడంతో నేటివిటి మిస్ కాకూడనే ఉద్దేశ్యంతో మణిరత్నం ఈ చిత్రాన్ని ఎక్కువగా తమిళ ఆర్టిస్టులతో తెరకెక్కించారు. దాంతో ఈ సినిమా మిగతా భాష ప్రేక్షకులకు అంతగా ఎక్కలేదు. కానీ ఈ సినిమాకు మణిరత్నం తెరకెక్కించిన విధానాన్ని అందరు మెచ్చుకున్నారు. ( Ponniyin Selvan twitter review)
వసూళ్లతో ఈ సినిమా కేవలం తమిళనాడులో మాత్రమే 400 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. ఒక్క తమిళనాడులోనే రూ. 450 కోట్లను వసూలు చేసిన కోలీవుడ్ మూడో కోలీవుడ్ మూవీ ఇదేనని అంటున్నారు. ఒక అరుదైన రికార్డును ఈ సినిమా సొంతం చేసుకుందని చెబుతున్నారు.తమిళంలో 2.O, విక్రమ్, తర్వాత పొన్నియన్ సెల్వన్ రికార్డు సెట్ చేసింది.
పొన్నియన్ సెల్వన్ పస్టు పార్టులో చాలా కథ నడచిన తరువాతగాని, అసలు ఏం జరుగుతుందనేది అర్థం కాదు. పైగా కొన్ని ఫ్లాష్ బ్యాక్ లు సెకండ్ పార్టులో రివీల్ కానున్నాయి. అసలు కథ అంతా కూడా సెకండు పార్టులోనే ఉంటుంది. మిగతా భాషల్లో అంతగా నడవకపోయినా.. ఓవరాల్‌గా ఈ సినిమా హిట్ స్టేటస్ అందుకుంది. మొత్తంగా రెండో పార్ట్ అన్ని మిగతా భాషల్లో ఇరగదీస్తుందా లేదా అనేది చూడాలి.