Ponniyin Selvan: మణిరత్నం ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పొన్నియన్ సెల్వన్ సెప్టెంబర్ 30న రిలీజ్ అయ్యింది. ఈ సినిమా తెలుగు, హిందీ సహా మిగతా భాష ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేకపోయినా.. తమిళనాడులో మాత్రం రికార్డులు క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ చిత్రం ఖాతాలో మరో రికార్డు నమోదు అయింది. తాజాగా ఈ చిత్రం రూ. 450 కోట్ల గ్రాస్ క్లబ్బులో చేరినట్టు చిత్ర యూనిట్ లైకా వాళ్లు ప్రకటించారు. Ponniyin selvan 1 collections Twitter
విక్రమ్, ఐశ్వర్యరాయ్, జయం రవి, కార్తి, త్రిష,శరత్ కుమార్, జయరామ్, ప్రకాష్ రాజ్,ప్రభు, విక్రమ్ ప్రభు వంటి భారీ స్టార్ కాస్ట్‌తో నిర్మించిన ఈ చిత్రాన్ని తమిళ చోళ రాజ్యానికి సంబంధించిన కథ కావడంతో నేటివిటి మిస్ కాకూడనే ఉద్దేశ్యంతో మణిరత్నం ఈ చిత్రాన్ని ఎక్కువగా తమిళ ఆర్టిస్టులతో తెరకెక్కించారు. దాంతో ఈ సినిమా మిగతా భాష ప్రేక్షకులకు అంతగా ఎక్కలేదు. కానీ ఈ సినిమాకు మణిరత్నం తెరకెక్కించిన విధానాన్ని అందరు మెచ్చుకున్నారు. ( Ponniyin Selvan twitter review)
ఈ నెల నెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ తారాగణం .. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, తొలి రోజునే రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టింది. తెలుగులో ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడియన్స్ కి కనెక్ట్ కాకపోయినా, తమిళనాడులో మాత్రం వసూళ్ల పరంగా అదే ఊపు కొనసాగుతోంది. Ponniyin selvan 1 collections Twitter
వసూళ్లతో ఈ సినిమా కేవలం తమిళనాడులో మాత్రమే 400 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. ఒక్క తమిళనాడులోనే రూ. 450 కోట్లను వసూలు చేసిన కోలీవుడ్ మూడో కోలీవుడ్ మూవీ ఇదేనని అంటున్నారు. ఒక అరుదైన రికార్డును ఈ సినిమా సొంతం చేసుకుందని చెబుతున్నారు.తమిళంలో 2.O, విక్రమ్, తర్వాత పొన్నియన్ సెల్వన్ రికార్డు సెట్ చేసింది.