Prabhas Backdrop Movies : కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకయితే.. కనిపించని ఆ నాలుగే సింహమేరా పోలీస్ అనే డైలాగ్ మీకు గుర్తుంది కదా. ఇక వెండితెరపై పోలీస్ పాత్ర ఎవర్ గ్రీన్ ఫార్ములా. ఎంతో మంది ఒంటి మీద ఖాకీ డ్రెస్ వేసుకొని రఫ్పాడించారు. కొంత మంది హీరోలు ఖాకీ పవర్ చూపించడానికి రెడీ అవుతున్నారు. (File/Photo)
ఈ జనరేషన్ టాప్ హీరోల్లో ఖాకీ డ్రెస్ వేయని ఒకే ఒక్క హీరో ప్రభాస్. ఇపుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేస్తోన్న ‘స్పిరిట్’ మూవీలో తొలిసారి పోలీస్ యూనిఫామ్‌లో కనిపించనున్నారు. హీరోగా ప్రభాస్‌కు ఇది 25వ మూవీ. డార్లింగ్ అభిమానులు ప్రభాస్‌ను పోలీస్ డ్రెస్‌లో ఎపుడు చూద్దామా అని తెగ ఎదురు చూస్తున్నారు. (Twitter/UV Creations/Photo)
ప్రెజెంట్ జనరేషన్ హీరోల విషయానికొస్తే...‘కొమురం పులి’ సినిమాలో పోలీస్ గెటప్‌లో కనిపించాడు పవన్ కళ్యాణ్. కానీ ఆ సినిమా ప్లాప్ అయింది. ఆ తరువాత ఖాకీ డ్రెస్‌కు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్.. హారిష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ మూవీ కోసం ఖాకీ డ్రెస్ వేసుకున్నారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. (Twitter/Photo)
‘పోకిరి’ సినిమాకోసం తొలిసారిగా పోలీస్ డ్రెస్ వేసి హిట్ కొట్టారు మహేశ్ బాబు. ఆ తరువాత ‘దూకుడు’ సినిమా కోసం మరో సారి ఖాకీ డ్రెస్ వేసుకున్నారు. ఈ రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. ముచ్చటగా మూడో సారి మహేష్ తొడిగిన ఖాకీ డ్రెస్ మాత్రం కలిసి రాలేదు. ‘ఆగడు’లో ఖాకీ డ్రెస్ వేసిన మహేష్‌కు పరాజయం పాలైంది.(Twitter/Photo)
మొత్తంగా జనరేషన్‌తో సంబంధం లేకుండా అన్ని వేళలా పోలీస్ పాత్రలు బాక్సాఫీస్ దగ్గర హిట్ ఫార్ములా మారింది.రామ్‌కు మాత్రం ఈ ఫార్ములా కలిసి రాలేదు. ఇపుడు ఆ రూట్లో ప్రభాస్‌తో పాటు నాగ చైతన్య కూడా పోలీస్ పాత్రలో హిట్టు అందుకుంటారా లేదా అనేది చూడాలి. మొత్తానికి వెండితెరపై పోలీస్ డ్రెస్ అనేది ఎవర్ గ్రీన్ హిట్ ఫార్ములా అనే చెప్పాలి. ఈ ఫార్ములా వీళ్లకు కలిసొస్తుందా లేదా అనేది చూడాలి. (File/Photos)