తమిళంలోని విజయ్ టీవీలో ప్రసారమయిన ‘సూపర్ సింగర్’ రియాల్టీ షోతో ఫేమ్ సంపాదించుకున్న మాళవిక సుందర్ ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్లేబ్యాక్ సింగర్‌గా తమిళ చిత్రాల్లో సూపర్ హిట్ సాంగ్స్ పాడి అలరించిన మాళవిక సుందర్‌కు ఇన్‌స్టాగ్రాంలో పెద్ద సంఖ్యలోనే ఫాలోవర్లు ఉన్నారు. దాదాపు 2 లక్షల 71 వేల ఫాలోవర్లు ఆమెను ఇన్‌స్టాలో ఫాలో అవుతున్నారు.
ఆమె తరచూ ఇన్‌స్టాలో తన ఫొటోలతో పాటు తన ఫిట్నెస్ వీడియోలు, పాటలు పాడిన వీడియోలు పోస్ట్ చేస్తూ అభిమానులను ఖుషీ చేసేది. కానీ.. తాజాగా ఆమె పోస్ట్ పెట్టిన ఒక ఫొటో చూసి ఆమె ఫాలోవర్లు అవాక్కయ్యారు. 33 ఏళ్లకు తనకొక ఫర్ఫెక్ట్ లవ్ స్టోరీ దొరికిందని.. తనకు కాబోయే భర్తకు లిప్‌లాక్ పెడుతున్న ఫొటోను మాళవిక సుందర్ పోస్ట్ చేసింది. ఆ ఫొటో చూసి ఫాలోవర్లు షాకయ్యారు.
ఇద్దరూ ప్రేమలో ఉన్నారని ఆమె ఫాలోవర్లకు సంకేతాలను ఇచ్చేలా ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలను ఆమె అప్పుడప్పుడూ పోస్ట్ చేస్తుండేది. కానీ.. ఇలా లిప్‌లాక్ ఫొటో పోస్ట్ చేసి మరీ తమ బంధాన్ని ప్రకటిస్తుందని ఆమె ఫాలోవర్లు ఊహించలేకపోయారు. మాళవిక సుందర్ పలు తమిళ సినిమాల్లో చెప్పుకోదగ్గ పాటలు పాడింది. పెన్సిల్, 100% కాదల్, జాక్‌పాట్, మారి సినిమాల్లో ఆమె పాడిన పాటలు ప్రేక్షకాదరణ పొందాయి.
మాళవిక సుందర్ ఒక సందర్భంలో ఓ వ్యక్తికి ఇన్‌స్టాగ్రాంలో తగిన గుణ పాఠం చెప్పింది. ఆమెను అక్క అని సంబోధిస్తూ ఇన్‌స్టాలో ఆమెకు అసభ్యకర మెసేజ్‌లు చేసిన ఓ వ్యక్తి తనకు పంపిన ఆ సంభాషణను స్క్రీన్‌షాట్ తీసి తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. దీంతో.. తన గురించి అందరికీ తెలిసి పోయిందన్న కారణంగా సదరు వ్యక్తి సిగ్గు తెచ్చుకుని ఆమెకు తప్పయిపోయిందని, క్షమించాలని మెసేజ్ చేశాడు.
తాను ఆ టెక్స్ట్ పంపలేదని, తన ఫ్రెండ్ పంపాడని తప్పును వేరొకరి మీదకు నెట్టే ప్రయత్నం చేశాడు. ఈ వ్యక్తి విషయంలో మాళవిక సుందర్ తగిన విధంగా గుణ పాఠం చెప్పిందని, అక్కాచెల్లి అని సంబోధిస్తూ మనసులో నీచమైన ఆలోచనలతో కొట్టుమిట్టాడే అలాంటి మానసిక రోగులకు చేసిన తప్పు తెలిసొచ్చేలా మాళవిక చేసిందని నెటిజన్లు ఆమెను మెచ్చుకున్నారు.