దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన లేటెస్ట్ చిత్రం పెళ్లి సందD. ఆర్కా మీడియా వర్క్స్, ఆర్.కె ఫిలిం అసోసియేట్స్ బ్యానర్స్‌పై కె.కృష్ణ మోహన్ రావు సమర్పణలో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు అందించిన ఈ చిత్రానికి గౌరి రోణంకి దర్శకత్వం వహించారు. శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించారు. Sreeleela Twitter
ఇక అది అలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్గా చేసిన శ్రీలీలకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. కుర్ర హీరోలు ఆమెనే హీరోయిన్గా రికమెండ్ చేస్తున్నారట. టాలీవుడ్ లో కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిందంటే చాలు అందరి దృష్టి అటువైపే ఉంటుంది. దీనికి కారణం తెలుగులో హీరోయిన్ల కొరత చాలా ఎక్కువగా ఉందన్న సంగతి తెలిసిందే. Photo : Instagram
శ్రీలీల రవితేజ కాంబినేషన్లో వస్తున్న సినిమా విషయానికి వస్తే... మాస్ మహారాజ్ రవితేజ 2021లో ‘క్రాక్’ మూవీతో బోణీ చేసారు. ఈ సినిమా పోయిన యేడాది తొలి హిట్‌గా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కరోనా నేపథ్యంలో సగం ఆక్యుపెన్సీతో ఆడియన్స్ థియేటర్స్‌కు వస్తారా రారా అనే దానికి పులిస్టాప్ పెడుతూ.. ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. అంతేకాదు ఈ చిత్రం రవితేజ (Ravi Teja) కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి కొత్త ఊపిరిని ఇచ్చింది. మరోవైపు బలుపు, డాన్ శీను తర్వాత క్రాక్‌తో గోపీచంద్ మలినేనితో రవితేజ (Ravi Teja) హాట్రిక్ హిట్ నమోదు చేసారు. Photo : Instagram
ఇక ఆ సినిమా తర్వాత ఆయన వరుసగా సినిమాలను చేస్తున్నారు. అంతేకాకుండా వాటిని ఏకకాలంలో కూడా ఫినిష్ చేస్తున్నారు. క్రాక్ తర్వాత ఏకంగా మూడు సినిమాల అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా రవితేజ హీరోగా నటిస్తున్న మరో చిత్రం “ధమాకా” (Dhamaka). ఈ సినిమా తాజాగా మరో షెడ్యూల్‌ను పూర్తి చేసుకుందట. దీంతో టీమ్ తాజాగా ఓ ఫోటోను పంచుకుంది. ఈ షెడ్యూల్ పూర్తవ్వడంతో మొత్తంగా నాలుగు షెడ్యూల్లు పూర్తి అయ్యాయని తెలుస్తోంది. ఇక (Dhamaka) ఈ సినిమాలో పెళ్లి సందD హీరోయిన్ శ్రీ లీల హీరోయిన్గా నటిస్తున్నారు.. Photo : Instagram
ఇక రవితేజ నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆయన “రామారావు ఆన్ డ్యూటీ” (Rama Rao On Duty) అనే సినిమాను నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో చేస్తున్నారు. ఇక ఈ (Rama Rao On Duty) సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. ఈ టీజర్లో (Rama Rao On Duty teaser) రవితేజ సింపుల్ అండ్ స్టైలీష్ లుక్‌లో కేక పెట్టిస్తున్నారు. టీజర్ కూడా అదిరింది. ఈ సినిమాలో రవితేజ సరసన మజిలీ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ హీరోయిన్గా నటిస్తున్నారు.. Photo : Instagram
రవితేజ ఈ సినిమాతో పాటు మరో రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. అందులో భాగంగా ఆయన దర్శకుడు సుధీర్ వర్మ (Sudheer Varma) దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌తో కలిసి రవితేజ ప్రొడక్షన్ నిర్మాణం వహిస్తున్నారు. ఈ చిత్రానికి (Ravanasura) రావణాసుర టైటిల్‌ను ఫైనల్ చేశారు. ఈ సినిమాలో రవితేజ లుక్ ఇప్పటికే విడుదలవ్వగా తాజాగా ఈ సినిమా రెండో షెడ్యూల్ పూర్తి అయ్యినట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇక ఈ (Ravanasura) చిత్రంలో హీరో సుశాంత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 30న గ్రాండ్‌గా విడుదలకానుంది.. Photo : Instagram
ఇక రవితేజ నటిస్తున్న ప్యాన్ ఇండియా సినిమా టైగర్ నాగేశ్వరావు. ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. మరోవైపు రమేష్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ‘ఖిలాడి’ సినిమా తాజాగా ఫిబ్రవరి 11న విడుదలై మిక్స్డ్ టాక్‌ను తెచ్చుకుంది. ఈ సినిమాలో రవితేజ సరసన డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటించారు. యాక్షన్ కింగ్ అర్జున్ కీలకపాత్రలో కనిపించారు. ఈ సినిమా అనుకున్నంతగా అలరించలేకపోయింది.. Photo : Instagram