Sukanya: పెద్దరికం హీరోయిన్ సుకన్య గుర్తుందా... ఇప్పుడు ఆమె ఏజ్ ఎంతో తెలుసా ?
Sukanya: పెద్దరికం హీరోయిన్ సుకన్య గుర్తుందా... ఇప్పుడు ఆమె ఏజ్ ఎంతో తెలుసా ?
టాలీవుడ్లో చాలామంది అందమైన హీరోయిన్లు తమ సత్తా చాటారు. కొన్ని సినిమాల్లో నటించి ఆ తర్వాత ఫేడ్ అవుట్ అయిపోయారు. అలా తెలుగు సినిమాల్లో నటించి మెప్పించి కనిపించకుండా పోయిన హీరోయిన్ సుకన్య, ఇప్పుడామె తన సెకండ్ ఇన్నింగ్స్స్ ప్రారంభించింది.
అప్పటి హీరోయిన్ సుకన్య ఈ జనరేషన్ వాళ్లకు పెద్దగా తెలియకపోయినా... 80, 90 జనరేషన్ వాళ్లకు మాత్రం బాగా సుపరిచితం. ఈ భామ జగపతిబాబు హీరోగా వచ్చిన అప్పటి పెద్దరికం సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది.
2/ 9
సుకన్య తమిళ సినిమా నిర్మాత రమేష్ యొక్క కూతురు. ఈమె భారతీరాజా దర్శకత్వము వహించిన తమిళ చిత్రం పుదు నెల్లు పుదు నాథు సినిమా రంగప్రవేశము చేసింది.
3/ 9
2015లో వచ్చిన మహేష్ బాబు హీరోగా వచ్చిన శ్రీమంతుడు సినిమాతో మరోసారి సుకన్య తెలుగు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో సుకన్య మహేష్ బాబుకు తల్లిగా నటించింది. ఇందులోకూడా ఆమె... జగపతిబాబుకు భార్యగా నటించింది.
4/ 9
సుకన్య తమిళ్లో చిన్నక్ కౌంటర్, తిరుమతి పళనిచామి, సెంథమిల్ పట్టు, చిన్న మేబుల్, వాల్టర్ వెట్రివేల్, మహానటి, ఇండియన్' వంటి అనేక విజయవంతమైన చిత్రాలలో నటించారు.
5/ 9
సుకన్య తమిళంతో పాటు మలయాళం, కన్నడ, తెలుగు భాషల్లో కూడా నటించింది.దీంతోపాటు ఆమె టీవీ సీరియల్స్‌లో నటిగా షోలలో న్యాయనిర్ణేతగా ఉన్నారు.
6/ 9
నటనతో పాటు భరతనాట్య కళాకారిణిగా, గాయనిగా, నేపథ్య గాయనిగా సుకన్య తన ప్రతిభ చాటుకున్నారు.
7/ 9
ప్రస్తుతం సుకన్య కమల్ హాసన్ భారతీయుడు 2లో అమృతవల్లిగా నటిస్తున్నాడు. ఇటీవలే.. సుకన్య తన 50వ పుట్టినరోజు జరుపుకుంది.
8/ 9
తన 50వ పుట్టినరోజును కుటుంబ సభ్యులతో కలిసి లండన్‌లో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని సుకన్య ఇంటర్నెట్లో పోస్ట్ చేసింది.
9/ 9
సుకన్య కళాక్షేత్రలో స్కాలర్షిప్పుతో నాట్యం అభ్యసించి, ఆ తరువాత ప్రముఖ నర్తకి చంద్రలేఖ నాట్యబృందముతో పాటు అనేక నృత్యోత్సవాల్లో పాల్గొన్నది. 1987 ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో పాల్గొనటానికి రష్యా వెళ్లిన బృందములో అతి పిన్న వయస్కురాలు సుకన్య.