తొలి సినిమాతోనే యూత్ ఆడియన్స్ గుండెల్లో గూడు కట్టుకుంది పాయల్ రాజ్‌పుత్. ఆర్ఎక్స్100 సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి గ్లామరస్ హీరోయిన్గా వెండితెరపై తన మార్క్ చూపించింది. తాజా ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.
తొలి సినిమాతోనే యూత్ ఆడియన్స్ గుండెల్లో గూడు కట్టుకుంది పాయల్ రాజ్‌పుత్. ఆర్ఎక్స్100 సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి గ్లామరస్ హీరోయిన్గా వెండితెరపై తన మార్క్ చూపించింది. ఈ సినిమాలో అమ్మడి నటన, అందాల ఆరబోతకు తెలుగు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు.
2/ 8
వచ్చి రావడంతోనే బ్లాక్‌బస్టర్ హిట్ సాధించడంతో ఇక ఆమె కెరీర్‌కి డోకా లేదని అంతా అనుకున్నారు కానీ అనూహ్యంగా పాయల్ కెరీర్ ఒడిదొడుకుల మధ్య సాగుతోంది. ఆశించిన మేర బిగ్ ఆఫర్స్ అయితే రావడం లేదు.
3/ 8
దీంతో కథల ఎంపికలో ఎంతో జాగ్రత్త తీసుకుంటున్న పాయల్.. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ ప్రేక్షకుల మనసు దోచుకుంటోంది. ఈ క్రమంలోనే ఐటెం సాంగ్స్ చేయడానికి కూడా రెడీ అంటోంది.
4/ 8
ఇక పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియా హవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం ఆన్ లైన్ మాధ్యమాలపై హంగామా చేస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటో షూట్స్ పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాను వేడెక్కించడం ఆమె నైజం.
5/ 8
ఈ నేపథ్యంలోనే తాజా కొన్ని ఫొటోస్ షేర్ చేసింది పాయల్. తన రెగ్యులర్ వే లో వెళ్లకుండా ఈ సారి కలర్ ఫుల్ కిక్కిచ్చింది. గ్లామర్ డోస్ పెద్దగా లేనప్పటికీ ట్రెండీ వేర్ లో దర్శనమిచ్చి ఫిదా చేసింది. దీంతో పాయల్ షేర్ చేసిన ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
6/ 8
ప్రస్తుతం లవ్‌లో ఉన్న పాయల్.. ప్రియుడు సౌరభ్ దింగ్రాతో చట్టపట్టాలేసుకు తిరుగుతోంది. పాయల్ బుల్లితెర నటిగా ఉన్నప్పటి నుంచే వీరికి పరిచయం ఉంది. సౌరభ్ ఓ మ్యూజిక్ కంపోజర్ కమ్ యాక్టర్.
7/ 8
రీసెంట్ గా మంచు విష్ణుతో కలిసి జిన్నా సినిమాలో నటించింది పాయల్ రాజ్ పుత్. ఈ సినిమాలో పాయల్ తో పాటు మాజీ శృంగార తార సన్నీలియోన్ కూడా నటించింది. ఈ మూవీపై పాయల్ ఎన్నో ఆశలు పెట్టుకుంది కానీ ఇది కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. రిలీజ్‌కి ముందు భారీ హైప్ తీసుకొచ్చినా అందుకు తగిన ప్రయోజనం దక్కలేదు.
8/ 8
కన్నడలో కూడా అడుగుపెట్టిన పాయల్.. హెడ్ బుష్ సినిమా చేస్తోంది. ఇక తమిళంలో ఏంజెల్ పేరుతో ఓ కామెడీ హారర్ చిత్రంలో భాగమవుతోంది. తమిళంలో ఇదే మొదటి చిత్రం. సినిమాల సంగతి ఎలా ఉన్నా గ్లామర్ పరంగా యూత్ లో పాయల్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.