Payal Rajput : ఆర్ఎక్స్100 సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గుబులు పుట్టించిన పాయల్ రాజ్‌పుత్ సందర్భాన్ని బట్టి అందాలు ప్రదర్శిస్తూనే ఉంది. తెలుగు చిత్రసీమలో గ్లామర్ పాత్రలతో యువతరం ఆరాధ్య నాయికగా గుర్తింపును సొంతం చేసుకున్నది ఈ పంజాబీ బ్యూటీ. గతేడాది దీపావళి కానుకగా విడుదలై ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చినా అనుకున్నంత రేంజ్లో కలెక్షన్స్ రాబట్టడంలో విఫలమైంది. (Instagram/Photo)
అభినయం చేసే పాత్రలను ఎంచుకోకుండా.. కేవలం గ్లామర్ రోల్స్ చేయడం కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని అంటున్నారు. మంచు విష్ణు సరసన నటించిన ‘జిన్నా’లో పాయల్ రాజ్‌పుత్‌తో పాటు సన్ని లియోన్ కూడా నటించింది. దీంతో పాయల్ పై ఫోకస్ కాస్తంత తగ్గింది. ఈ సినిమా ఫలితంతో పాయల్‌కు పెద్దగా ఒరిగిందేమి లేదనే చెప్పాలి. (Photo : Instagram)
పాయల్‌రాజ్‌పూత్ షేర్ చేసిన బోల్డ్ పిక్స్ చూసిన అభిమానులు వెరైటీగా స్పందిస్తున్నారు. వాళ్ల కామెంట్స్ షేర్ చేస్తున్నారు. స్టన్నింగ్, ప్రెట్టీ, గార్జియస్, నాటీ, బ్యూటీఫుల్ అంటూ కామెంట్స్ చేస్తూనే లవ్ ప్రపోజల్స్ చేస్తున్నారు. దిల్ సింబల్స్, ఎమోజీలను షేర్ చేస్తున్నారు. (Photo Credit:Instagram)
అందులో భాగంగా ఆమె కన్నడ సినీ పరిశ్రమలోకి అరంగేట్రం చేయబోతున్నది. అలాగే కన్నడలో కూడా అడుగుపెట్టింది పాయల్. ఆమె డెబ్యూ చిత్రం హెడ్ బుష్ సినిమాతో పలకరించింది. ఇక తమిళంలో ఏంజెల్ పేరుతో ఓ కామెడీ హారర్ చిత్రం చేస్తున్నారు. తమిళ భాషలో ఆమెకు ఇదే మొదటి చిత్రం.జిన్నా తర్వాత తెలుగులో కిరాతక మూవీతో పలకరించనుంది ఈ భామ. Photo : Instagram
ఈమధ్యనే ఓ పంజాబీ చిత్రానికి పాయల్ సైన్ చేశారు. ఆ చిత్ర షూటింగ్ మొదలుకాగా, పాయల్ పాల్గొంటున్నారు. పాయల్ ఇక ఆది సాయి కుమార్ తో ‘తీస్మార్ ఖాన్’ చిత్రంలో నటించింది. ఆ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా అతనితో మరో మూవీ చేయడానికి రెడీ అవుతోంది. ఈ మూవీకి కిరాతక అనే టైటిల్ నిర్ణయించగా, చిత్రీకరణ దశలో ఉంది. Photo Credit: Payal Rajput Instagram