Payal rajput: 2018లో వచ్చిన ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన అందాల ముద్దుగుమ్మ పాయల్ రాజ్‌పుత్. తొలి సినిమాతోనే తనదైన నటన, అందంతో ఆకట్టుకుందీ ఉన్నది. ఓవైపు నెగిటివ్ షేడ్స్‌లో ఉన్న పాత్రలో కనిపిస్తూనే మరోవైపు తన అందంతో కుర్రకారును గుండెల్లో గిలిగింతలు పెట్టించిందీ. ఆర్ఎక్స్ 100 చిత్రం తర్వాత పాయల్‌కు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.
కెరీర్ విషయానికొస్తే పాయల్ రాజ్‌పుత్ ప్రస్తుతం తెలుగు, తమిళం, కన్నడ చిత్రాల్లో నటిస్తోంది. పాయల్ రాజ్ పుత్ కు నటనకు ప్రాధాన్యత ఉన్న రోల్స్ కంటే ఎక్కువగా గ్లామర్ రోల్స్ దక్కుతున్నాయి. అయినా సరే ఎక్కడా తగ్గని ఈ భామ వరుసగా విభిన్నమైన సినిమాలు ఒప్పుకుంటుంది. నిజానికి పాయల్ తమిళంలో 2013లో ఒక సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.