టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).. ప్రస్తుతం అటు రాజకీయాలు, ఇటు సినిమాలు హ్యాండిల్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. అజ్ఞాతవాసి సినిమా తర్వాత వెండితెరకు బై బై చెప్పి కొన్నేళ్లు పూర్తిస్థాయి రాజకీయాల్లో ఉంటూ చక్రం తిప్పిన పవన్.. తిరిగి వకీల్ సాబ్ రూపంలో ప్రేక్షకులను పలకరించారు.
ఆ వెంటనే పలు సినిమాల్లో నటించేందుకు అంగీకారం చెప్పి సెట్స్‌పై క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. రీ- ఎంట్రీ ఇచ్చిన వెంటనే వరుసగా బిగ్గెస్ట్ ప్రాజెక్టులను లైన్లో పెట్టిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు తాను నటించబోయే సినిమాల గురించి, అలాగే తన షెడ్యూల్స్ గురించి కీలక నిర్ణయం తీసుకున్నారనే సమాచారం వైరల్ అవుతోంది. దీంతో ఈ ఇష్యూ జనాల్లో హాట్ టాపిక్ అయింది.
ఇటీవలే 'భీమ్లా నాయక్' సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారు పవన్ కళ్యాణ్. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో దగ్గుబాటి రానాతో కలిసి తెరపంచుకున్నారు. ఈ మూవీ రిలీజ్ తర్వాత క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'హరిహర వీరమల్లు' సినిమాలో అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో 'భవదీయుడు భగత్ సింగ్' సినిమాలో నటిస్తున్నారు.
అయితే ఈ సినిమా షూటింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ తన సినిమాలకు కాస్త గ్యాప్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. ఇక రాజకీయాలపై ఫుల్ ఫోకస్ పెట్టడం కోసమే పవన్ సంచలన నిర్ణయం తీసుకున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. సో.. చూడాలి మరి పవన్ మరోసారి గ్యాప్ ఇస్తారా? లేదా సినిమాలతో పాటు పొలిటికల్ జర్నీ కంటిన్యూ చేస్తారా అనేది!.