Pawan Kalyan : బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న అన్‌స్టాపబుల్ షో ఓ రేంజ్లో దూసుకుపోతుంది. ఫస్ట్ సీజన్‌ను మించి సెకండ్ సీజన్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా అన్‌స్టాపబుల్ సీజన్ 2 గ్రాండ్ ఫినాలేకు అంతా సిద్ధమైంది. ఈ షోలో బాలయ్య.. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఈయన మొదటి భార్య నందిని గురించి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (Twitter/Photo)
పవన్ కళ్యాణ్.. తెలుగు సీని అభిమానుల సుపరితమైన పేరు. మాస్ ఐడియాలజీ వేలాది మందిని తన వైపు ఆకర్షించుకునేలా చేశారు. టాలీవుడ్ టాప్ హీరోగా కొనసాగుతూ.. అటూ రాజకీయాలు.. ఇటు సినిమాలు చేస్తూ ఎప్పుడు ట్రెండింగ్‌లో నిలుస్తుంటాడు. అయితే 2009లో అన్న ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ అరంగేట్రం చేసి యువరాజ్యం అధినేతగా కొనసాగారు. ఆ తర్వాత 2014లో తనే సొంతంగా జనసేన పార్టీని స్థాపించారు. ఇపుడు 2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఐనా మొక్కవోని ధైర్యంతో రాబోయే ఎన్నికల కోసం రెడీ అవుతున్నారు. (Twitter/Photo)
పవన్ కళ్యాణ్ పై ఎలాంటి రాజకీయ అవినీతి మరకలు లేకపోవడంతో ప్రత్యర్ధులకు ఆయన వ్యక్తిగత జీవితంపై వీలైనపుడల్ల టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ పెళ్ళిల విషయంపైనే ప్రత్యర్థి పార్టీలు ఎక్కువగా విమర్శలు చేశాయి. మూడు పెళ్ళిలు చేసుకున్నడంటూ పదేపదే పవన్‌ను కించపరుస్తూనే ఉన్నారు. ఇదే విషయపై అన్‌స్టాపబుల్‌లో పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇవ్వనున్నారు. (Twitter/Photo)
ఇక పవన్ వ్యక్తిగత జీవితానికి వస్తే మెగస్టార్ చిరంజీవి తమ్ముడిగా చిత్ర సినిమాలోకి అడుగు పెట్టారు. అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి అంచెలంచెలుగా ఎదుగుతూ పవర్ స్టార్ అయ్యారు. ముఖ్యంగా సుస్వాగతం,తొలిప్రేమ, తమ్ముడు, ,ఖుషీ,గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, వకీల్ సాబ్, భీమ్లా నాయక్ లాంటి సినిమాలతో తెలుగులో టాప్ హీరోగా ఎదిగారు. (Twitter/Photo)
నందిని అప్పట్లో పవన్ కళ్యాణ్ పై పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. తర్వాత 2007లో నందిని నుంచి పవన్ కళ్యాణ్ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత పవన్ బద్రి సినిమాలో తనతో హీరోయిన్గా చేసిన రేణు దేశాయ్‌తో సహజీవనం చేశారు. వారికి ఇద్దరూ పిల్లలు పుట్టారు. ఆ తర్వాత ఆమెను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత రేణు దేశాయ్‌తో కూడి విడిపోయి రష్యన్ నటి అన్నా లెజినోవాని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఓ పాప, బాబు ఉన్నారు. (Twitter/Photo)
పవన్‌తో విడిపోయిన రేణూ దేశాయి ప్రస్తుతం పుణేలో ఉంటూ నిర్మాత వ్వవహారిస్తూ.. అప్పుడప్పుడు పలు టీవీ షోలలో గెస్ట్‌గా కనిపిస్తున్నారు. ఇక నందిని విషయానికి వస్తే పవర్ స్టార్‌తో విడాకుల తర్వాత తన పేరును జాహ్నవిగా మార్చుకుంది. 2010లో డాక్టర్ కృష్ణా రెడ్డిని వివాహమాడింది. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నట్లు తెలుస్తోంది. అక్కడే భర్తతో తన జీవితాన్ని సంతోషంగా కొనసాగిస్తోందట. (File/Photo)