పవన్ కళ్యాణ్‌తో ఇప్పటికే బాలయ్య అన్ స్టాపబుల్ షో షూటింగ్ ముగిసింది. అటు పవర్ స్టార్ అభిమానులతో పాటు బాలయ్య ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అన్ స్టాపబుల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ విషయమై ఆహా ఓటీటీ ఎలాంటి అధికారిక ప్రకటన ఇప్పటి వరకు ఇవ్వలేదు. దీంతో ఆ అప్ డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా ఎదురు చూస్తున్నారు.
పవన్ కంటే ముందు బాలయ్య షోకు ప్రభాస్ వచ్చిన విషయం తెలిసిందే. ప్రభాస్‌తో బాలయ్య చేసిన టాక్ షో... రెండు ఎపిసోడ్లుగా టెలికాస్ట్ చేస్తున్నారు. మొదటి ఎపిసోడ్... డిసెంబర్ 30న స్ట్రీమింగ్ చేశారు. అయితే మరో ఎపిసోడ్‌ను ఈ శుక్రవారం స్ట్రీమింగ్ చేయనున్నారు. అయితే... ప్రభాస్ ఎపిసోడ్‌కు ఫుల్’గా ప్రమోషన్లు నిర్వహించారు.
అయితే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ను కూడా అదే రేంజ్లో ప్రమోషన్లు చేయాలని ఆహా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్‌తో బాలయ్య అనేక విషయాలప చర్చించారు. షోలో ఆయన వ్యక్తిగత విషయాలతో పాటు... రాజకీయాలపై కూడా బాలయ్య పవన్‌ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఎపిసోడ్‌ను ఇప్పుడు ఫుల్‌గా యుటలైజ్ చేసుకునే పనిలో ఉంది ఆహా. Pawan and Balakrishna Photo : Twitter
అందుకే పవన్, బాలయ్య ఎపిసోడ్‌కు కూడా బలంగా ప్రొమోలు... అప్ డేట్లు ఇచ్చే పనిలో పడింది ఆహా టీం. ప్రభాస్ ఎపిసోడ్ ఈ వారం అయిపోతే.. వచ్చేవారమే పవర్ స్టార్ ఎపిసోడ్ వచ్చేస్తుందని అంతా భావించారు. సంక్రాంతికి అసలైన పండగ అంటూ... పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు మరో అప్ డేట్ వినిపిస్తోంది.
ప్రభాస్ ఎపిసోడ్‌కు ఫుల్‌గా ప్రమోషన్లు చేసినట్లుగానే... పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ను కనీసం మూడు నాలుగు వారాల ముందు నుండే హడావుడి చేయాలని అనుకుంటున్నారు ఆహా నిర్వాహకులు. ఆహా సబ్స్క్రైబర్స్ ఖాతాదారుల సంఖ్య పెరగాలి అంటే ప్రమోషన్ ఎక్కువ చేయాలి. స్పెషల్ పోస్టర్లు, షార్ట్ వీడియోలు... ప్రొమోలు ఇలా అన్ని చేయాల్సి ఉంటుంది.