టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ 2022 అవార్డు దక్కింది. నలభై ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు, సందేశాత్మక చిత్రాల్లో నటించిన చిరంజీవికి ఈ అవార్డు వరించినట్లుగా కేంద్రమంత్రి అనురాగ్ఠాకూర్ గోవా 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకల్లో ప్రకటించారు. (Photo:Instagram)
ఇంతటి హ్యాపీ మూమెంట్లో తన మార్గదర్శి, అన్నయ్య చిరంజీవికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నానని ట్విట్ చేశారు పవర్ స్టార్. తెలుగు సినీ ఇండస్ట్రీలో శిఖర సమానులైన అన్నయ్యను అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో భాగంగా భారత ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించడం హ్యాపీగా ఉందన్నారు పవన్ కల్యాణ్. (Photo:Instagram)