బాలయ్య అటు రాజకీయాలు.. ఇటు సినిమాలతో దుమ్ములేపేతున్నారు అంతేకాదు.. ఓటీటీలో కూడా ఎంట్రీ ఇచ్చి అదరగొట్టారు. నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా మారి చేసిన తొలి టాక్ షో ‘అన్‌స్టాపబుల్’. ఫస్ట్ సీజన్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ టాక్ షోకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో, ఇప్పుడు రెండో సీజన్‌ను కూడా డిఫరెంట్ ఎపిసోడ్లతో నిర్వాహకులు స్ట్రీమింగ్ చేస్తున్నారు. (Twitter/Photo)
బాలయ్య అన్‌స్టాపబుల్ సెకండ్ సీజన్మొ దటి ఎపిసోడ్‌కు బాలయ్య బావగారు వచ్చారు. ఈ షోలో ఫస్ట్ ఎపిసోడ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు, యువనేత నారా లోకేష్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరిద్దరితో బాలయ్య అనేక విషయాలపై ఆసక్తికరంగా చర్చించారు. ఆ తర్వాత టాలీవుడ్ యంగ్ హీరోలను, పలు రాజకీయ నేతలనుతన షోకు పిలిచి.. సందడి చేశారు బాలయ్య, unstoppable with nbk (Photo Twitter)
సెకండ్ సీజన్లో బాలయ్య చేసిన ఫస్ట్ ఎపిసోడ్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక అదే ఊపుతో రెండు మూడు ఎపిసోడ్లు కూడా చేశారు. టాలీవుండ్ యంగ్ హీరోలు సిద్ధు జొన్నల గొడ్డ, విశ్వక్ సేన్‌తో ఓ ఎపిసోడ్, శర్వానంద్, అడివిశేష్‌తో మరో ఎపిసోడ్ చేశారు బాలకృష్ణ.ఇటీవలే బాలయ్య ఎపిసోడ్‌కు ప్రభాస్ కూడా వస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఆనంద పడుతున్నారు.
బాలయ్య, ప్రభాస్ మధ్య ఎలాంటి విషయలపై చర్చ జరగనుంది ? ప్రభాస్ పెళ్లిపై క్లారిటీ వస్తుందా? డార్లింగ్ ఏయే ఇంట్రస్టింగ్ విషయాలు చెబుతాడు అంటూ.. ప్రభాస్ అభిమానులు ఈ ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదరు చూస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ షోకు పవన్ కళ్యాణ్ కూడా రానున్నట్లు ఎప్పటి నుంచో జోరుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
అయితే పవన్ ఎపిసోడ్ తో బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్ 2 ముగుస్తుందని తెలుస్తుంది. పవన్ బాలయ్య షోనే ఈ సీజన్‌కు చివరి ఎపిసోడ్ అని సమాచారం. అయితే ఇక పవన్ వస్తే బాలయ్య ఎలాంటి ప్రశ్నలు అడుగుతారని ఫ్యాన్స్ ఇంట్రస్టింగ్‌గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇద్దరు ఇటు సినిమాలతో పాటు.. అటు ఏపీ రాజకీయాల్లో కూడా చురుకుగా ఉన్నారు. అందుకే వీరిద్దరి మధ్య ఎలాంటి విషయాలపై చర్చ జరగనుందని అంతా ఎదురు చూస్తున్నారు. Balakrishna and Pawan Kalyan Photo : Twitter
మరోవైపు పవన్ ఇలాంటి టాక్ షోలకు రావడం మట్లాడటం చాలా తక్కువ. రాజకీయంగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతుంటారు తప్పా.. ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇవ్వడం... షోలకు రావడం పవన్ పెద్దగా ఆసక్తి చూపరు. మరి ఇప్పుడు బాలయ్య టాక్ షోకు పవన్ వచ్చేందుకు సిద్ధమయ్యారన్న వార్తలతో పవన్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.