Pawan Kalyan - Gopichand : తెలుగు సినిమాల్లో మాస్‌ను ఆకట్టుకునే ఎవర్ గ్రీన్ పాత్రల్లో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అయితే.. రెండోది లాయర్ పాత్ర అని చెప్పాలి. తెలుగు సినిమాల్లో కోర్టు రూమ్ డ్రామాతో పలు సినిమాలు తెరకెక్కాయి. ఇందులో చాలా సినిమాలు ప్రేక్షకులు ఆకట్టుకున్నాయి. తాజాగా గోపీచంద్ హీరోగా నటించిన ‘పక్కా కమర్షియల్’ మూవీ కూడా కోర్ట్ రూమ్ డ్రామాతో పలకరించాడు. (File/Photo)
Pawan Kalayan -Gopichand as Lawyer Charecters : పవన్ కళ్యాణ్ గత యేడాది వకీల్‌సాబ్‌గా టైటిల్ రోల్లో అదరగొట్టిన సంగతి తెలిసిందే కదా. ఆ తర్వాత సత్యదేవ్ ‘తిమ్మరుసు’గా వకీల్ సాబ్ పాత్రలో తనదైన శైలిలోొ మెప్పించారు. ఆ తర్వాత తమిళ స్టార్ హీరో సూర్య కూడా ‘జై భీమ్’ అంటూ పేదల తరుపున పోరాడే లాయర్ పాత్రలో ప్రేక్షకులను పలకరించారు. రీసెంట్గా మాచో స్టార్ గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’ మూవీలో లాయర్ పాత్రలో అదరగొట్టాడు.
యువ నటుడు విశ్వక్ సేన్ (Vishwak Sen) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అక్కర లేదు. వరుస సినిమాల్లో నటిస్తూ అదరగొడుతున్నారు. అందులో భాగంగా ఆయన ముఖ చిత్రం (Mukhachitram) అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో లాయర్ పాత్రలో నటించారు. దానికి సంబంధించిన లుక్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. (Twitter/Photo)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. దిల్ రాజు నిర్మాణంలో శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ సినిమా చేసారు. తొలిసారి వకీల్ సాబ్‌గా అదరగొట్టారు పవన్ కళ్యాణ్. చాలా యేళ్ల తర్వాత మై ఓల్టేజ్ పాత్రలో పవన్ కళ్యాణ్ లాయర్‌గా అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్‌ను తన నటనతో ఆకట్టుకున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని నమోదు చేసింది. అంతేకాదు పవన్ కళ్యాణ్ కెరీర్లో డిఫరెంట్ మూవీగా నిలిచిపోయింది. (Twitter/Photo)
పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైమ్ ఆయన ఫిల్మ్ కెరీర్లో వకీల్ సాబ్ పాత్రలో నటించి మెప్పించారు. ఈ చిత్రం హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన ‘పింక్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గరతో పాటు అమెజాన్ ప్రైమ్‌లో హిట్ టాక్ తెచ్చుకుంది. అంతేకాదు టీవీల్లో మంచి టీఆర్పీ సాధించింది. (Twitter/Photo)