Pawan Kalyan - Vakeel Saab | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. దిల్ రాజు నిర్మాణంలో శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ సినిమా చేసారు. తొలిసారి వకీల్ సాబ్‌గా అదరగొట్టారు పవన్ కళ్యాణ్. చాలా యేళ్ల తర్వాత మై ఓల్టేజ్ పాత్రలో పవన్ కళ్యాణ్ లాయర్‌గా అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్‌ను తన నటనతో ఆకట్టుకున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని నమోదు చేసింది. (Twitter/Photo)
సత్యదేవ్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’కు పోటీగా.. తిమ్మరుసు సినిమా చేస్తున్నారు. కోర్టు డ్రామా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన ‘తిమ్మరుసు’ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి పవన్ కళ్యాణ్ రేంజ్లో వకీల్ సాబ్‌గా ఏ మేరకు అదరగొడతాడనేది చూడాలి. ఇక పవన్ కళ్యాాణ్ నటించిన తాజా చిత్రం ‘వకీల్ సాబ్’లో పవన్ పేరు సత్యదేవ్ కావడం మరో విశేషం. (Twitter/Photo)
పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైమ్ ఆయన ఫిల్మ్ కెరీర్లో వకీల్ సాబ్ పాత్రలో నటించారు. ఈ చిత్రం హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన ‘పింక్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గరతో పాటు అమెజాన్ ప్రైమ్‌లో హిట్ టాక్ తెచ్చుకుంది. అంతేకాదు దాదాపు 100మిలియన్ పైగా హిట్స్ వచ్చిన తెలుగు సినిమాగా రికార్డులకు ఎక్కినట్టు అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. (Twitter/Photo)