Pawan Kalyan Sujeeth Movie: ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు పవన్ కళ్యాణ్. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే పవన్ కళ్యాణ్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో చేయనున్నాడు. దానికి సంబంధించిన అపీషియల్ ప్రకటన కూడా విడుదల చేసారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాల వివరాలను చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఇక హరి హరవీరమల్లు తర్వాత రన్ రాజా రన్, సాహో చిత్రాలతో తన దర్శకత్వ ప్రతిభను బయటపెట్టిన యువ దర్శకుడు సుజీత్.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. స్టైలిష్ మేకోవర్ తో సినిమాలు చేయడంలో దిట్ట అయిన సుజిత్, పవన్ కోసం ఓ బలమైన కమర్షియల్ యాంగిల్ స్టోరీ సిద్ధం చేసుకున్నారని టాక్.
అటు రాజకీయాలు, ఇటు సినిమాలు బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్. తాజాగా ఈయన బాలయ్య అన్‌స్టాపబుల్ సీజన్ 2లో పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్ ఫిబ్రవరి 3న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. బాలయ్యతో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ రెండు భాగాలుగా రానుంది. ఈ క్రమంలోనే సుజీత్ తో సినిమాను లైన్ లోకి తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్.
ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్న పవన్ కళ్యాణ్.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు కూడా కమిటై ఉన్నారు. సో దీన్నిబట్టి ఈ మూడు సినిమాలను చకచకా కంప్లీట్ చేసి 2024 ఏపీలో జరిగే సార్వత్రిక ఎన్నికల కోసం పూర్తిగా తన సమయం కేటాయించాలనే ప్లాన్‌లో ఉన్నారు పవర్ స్టార్ అలియాస్ జనసేనాని.