పవర్ స్టార్ సినిమా అంటే గ్రాండ్ ఎంట్రీ సాంగ్, మినిమమ్ ఓ నాలుగైదు ఫైట్ సీన్స్ ఉండాల్సిందే. పవన్ కళ్యాణ్ ని అలా చూసి ఆయన అభిమానులు హుషారెత్తిపోతుంటారు. థియేటర్ టాప్ లేచిపోయేలా సెకండ్ ఆఫ్‌లో ఓ ఐటెం సాంగ్ కూడా ఉంటే ఊగిపోతుంటారు. ఇంటర్వెల్లో పవర్ఫుల్ డైలాగ్స్ మస్ట్ అంటారు ఫ్యాన్స్. అయితే సుజీత్ సినిమాలో ఇవేవీ ఉండవని తెలుస్తోంది.
సాహో లాంటి హై యాక్షన్ ఎంటర్టైనర్ తర్వాత దాదాపు నాలుగేళ్లు గ్యాప్ తీసుకున్న సుజీత్ ఈ సినిమా కోసం పర్ఫెక్ట్ ప్లాన్ చేసుకున్నారట. పవన్‌కు సుజీత్ వీరాభిమాని కావడంతో ఈ సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని అంతా ఫిక్సయ్యారు. కాకపోతే పవన్ ఎలివేషన్స్, ఆయన మార్క్ ఎంటర్టైన్మెంట్ విషయంలోనే అనుమానాలు మొదలయ్యాయి.