Pawan Kalyan : పవన్ కళ్యాణ్ అనూహ్య నిర్ణయం.. ఇకపై పవన్ తన సినిమాల్లో పవర్ స్టార్ బిరుదు లేకుండానే మూవీలను రిలీజ్ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. తాజాగా విడుదలైన ‘భీమ్లా నాయక్’ మూవీలో పవన్ కళ్యాణ్.. తన పేరు ముందు పవర్ స్టార్ అనే బిరుదు వేసుకోలేదు. ఇకపై తనను అందరు పవర్ స్టార్ పనవ్ కళ్యాణ్ అని కాకుండా.. కేవలం అని మాత్రమే సంబోధించాలని అభిమానులకు పిలుపు ఇవ్వడమే కాకుండా.. తాజాగా ‘భీమ్లా నాయక్’ మూవీతో నిజంగా పవర్ స్టార్ బిరుదును త్యాగం చేసి అభిమానులకు చెప్పినట్టే పెద్ద షాకే ఇచ్చారు. (Twitter/Photo)
పవన్ కళ్యాణ్ .. పవర్ స్టార్ బిరుదు త్యాగం వెనక పెద్ద కథే ఉంది. ప్రస్తుతం పవన్... హీరోగానే కాకుండా.. జనసేనానిగా సినిమాల్లో రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. రాజకీయాల్లో అంతగా ప్రభావం చూపించక పోవడంతో ప్రత్యర్థులు ఆయన్ని పవర్ లేని స్టార్‌గా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసిన సందర్భాలున్నాయి. అందుకే ప్రత్యర్ధులకు ఇకపై ఎలాంటి ఛాన్స్ ఇవ్వకూడదనే నిర్ణయానికి వచ్చిన పవన్ కళ్యాణ్.. తన పవర్ స్టార్ బిరుదును త్యాగం చేశారని ఆయన అభిమానులు చెప్పుకుంటున్నారు. (Twitter/Photo)
మొత్తానికి పవన్ కల్యాణ్.. పవర్ స్టార్ పేరు పెట్టడం వెనక పోసాని కృష్ణమురళి ఉన్నారు. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్‌తో పాటు పోసాని కూడా ప్రస్తావించారు కూడా. మొత్తానికి పవర్ స్టార్ అనే బిరుదుతో నిజంగానే పవన్ కళ్యాణ్.. తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్‌గా తన సత్తా చూపిస్తూనే ఉన్న సంగతి తెలిసిందే కదా.(Twitter/Photo)
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ఈ కోవలోనే పవన్ కళ్యాణ్.. యాక్ట్ చేసిన ‘భీమ్లా నాయక్’ సినిమా విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. సినీ, రాజకీయాలు మిక్స్ అయిపోయిన ఈ సందర్భంలో తనను ఎవరు ట్రోల్ చేయకూడదనే నిర్ణయానికి వచ్చిన పవన్ కళ్యాణ్ తన పేరు ముందున్న పవర్ స్టార్ బిరుదును త్యాగం చేస్తున్నట్టు చెప్పడమే కాదు.. తాజాగా ‘భీమ్లా నాయక్’ మూవీలో కేవలం తన పేరును పవర్ స్టార్ లేకుండా పవన్ కళ్యాణ్ అని టైటిల్ కార్డ్స్ వేయడం గమనార్హం. (Twitter/Photo)