పవన్ కళ్యాణ్ ఓ వైపు ఏపీ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటూ మరోవైపు వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆయన ఓ మూడు సినిమాలను చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా వస్తోన్న ‘హరి హర వీరమల్లు’ చిత్రీకరణ దశలో ఉంది. హరీష్ శంకర్ ‘భవదీయుడు భగత్ సింగ్’ స్ర్కిప్టుతో రెడీగా ఉన్నారు. ఇవి కాక పవన్ మరో రీమేక్‌లో నటిస్తున్నారు. Photo : Twitter
ఈ సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా తమిళ చిత్రం ‘వినోదయసీతమ్’ తెలుగు రీమేక్‌గా వస్తోంది. ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించనున్నారని టాక్. సముద్రఖని దర్శకత్వం వహించనున్నారు.కీలకపాత్రలో మరో మెగా హీరో సాయిధరమ్ తేజ్ కనిపించనున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను నిన్న జరిగాయని ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సినిమా లాంచింగ్‌ను సైలెంట్‌గా కానిచ్చేశారట చిత్రబృందం. Photo : Twitter
ఈ సినిమా షూటింగ్‌ను ఆగస్టు నాటికి పూర్తి చేసి.. 2023 ప్రధమార్థంలో విడుదల చేయాలనీ భావిస్తోందట టీమ్. అయితే ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. వినోదయసీతమ్ కథ విషయానికి వస్తే.. ఈ సినిమా పవన్ మరో సినిమా గోపాల గోపాల చిత్రానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ సినిమాలో పవన్ మరోసారి దేవుడిగా కనిపించనున్నారు. అయితే ఈ సినిమాకు ఆయన కేవలం 15 నుండి 20 రోజుల మాత్రమే డేట్స్ కేటాయించారట. అన్ని రోజులకుగాను పవన్ కళ్యాణ్ 50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. Photo : Twitter
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak). ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథనం అందించారు. ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ఇటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు ఓవర్సీస్‌లోను మంచి కలెక్షన్స్ దక్కించుకుంది. Photo : Twitter
భీమ్లానాయక్ (Bheemla Nayak) ఓవర్సీస్లో 2 మిలియన్ డాలర్స్‌కు పైగా కలెక్షన్స్ సాధించిందని అదరగొట్టింది. ఈ సినిమా ప్రస్తుతం డిస్నీ హాట్ స్టార్‌తో పాటు ఆహాలో గత మార్చి 24న నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా విడుదలైన సరిగ్గా 4 వారాలకు అంటే 27 రోజులకు రెండు ఓటీటీ ఫ్లాట్‌ఫ్లామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మాణంలో దర్శకుడు సాగర్ కె చంద్ర రూపొందించిన భీమ్లా నాయక్.. మలయాళ అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు రీమేక్‌గా వచ్చింది. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. Photo : Twitter
ఇక పవన్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ అనేక వాయిదాల తర్వాత ఇటీవలే మొదలైంది. ఇక అది అలా ఉంటే పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం తాజాగా కొన్ని రిహార్సల్స్ చేశారు. సినిమాలో ఓ కీలకసన్నివేశం కోసం ఆయన ఫైట్ మాస్టర్స్‌తో ప్రాక్టీస్ చేసారు. దీనికి సంబంధించి ఇటీవల కొన్ని పిక్స్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నిధి అగర్వాల్ (Nidhi Aggerwal) హీరోయిన్గా నటిస్తున్నారు. Photo : Twitter
భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ ప్యాన్ ఇండియా సినిమా ఇప్పటికే దాదాపు 60 శాతం మేర షూటింగ్ పూర్తి చేసుకుంది. దసరా కానుకగా హరి హర వీరమల్లు (Hari Hara Veera Mallu) చిత్రాన్ని మేకర్స్ అక్టోబర్ 5 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని టాక్. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వజ్రాల దొంగగా కనిపించనున్నాడని అంటున్నారు. పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మొదటి పాన్ ఇండియన్ సినిమా ఇది. హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ (Nidhi Aggerwal) హీరోయిన్ గా నటిస్తుండగా కీరవాణి (Keeravani) సంగీతం అందిస్తున్నారు. Photo : Twitter
మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏ యం రత్నం (AM Ratnam) నిర్మిస్తున్నారు. ఈ సినిమా పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈచిత్రం ఆడియో హక్కులను ప్రముఖ సంస్థ టిప్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. టిప్స్ సంస్థ హరిహర వీరమల్లు సినిమా ఆడియో రైట్స్‌ను భారీ ధరకు దక్కించుకుందని అంటున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. Photo : Twitter