Suma Kanakala : యాంకర్ సుమ (Anchor Suma)అంటే తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులుండరు. అంత పాపులర్ సుమ. టీవీ తెరపై ఆమె ఓ మెగాస్టార్. ఎంత పెద్ద షో అయిన ఏ మాత్రం బెదరకుండా తన మాటలతో రంజింప చేస్తూ ఆకట్టకుంటారు. సుమ జన్మత: మలయాళీ అయినా తెలుగింటి కోడలై.. మాటలతో మైమరిపిస్తున్నారు. యాంకర్ సుమ.. సినిమాల్లో చిరంజీవి తన డ్యాన్స్‌లతో, నటనతో తనదైన మేనరిజంతో ఎంత పేరు తెచ్చుకున్నాడో.. టీవీల్లో కూడా సుమ (Suma Kanakala) తన దైన స్టైల్లో యాంకరింగ్‌కు చేస్తూ అప్పటికప్పుడు సమయస్పూర్తిగా వ్యవహరిస్తూ అంత పేరు తెచ్చుకున్నారు. Photo : Twitter
తన మాటలతో గానీ చేతలతో గానీ ఎవరనీ నోప్పించని సుమ ఓ వైపు యాంకరింగ్ చేస్తూనే ఓ సినిమాలో నటిస్తున్నారు. జయమ్మ పంచాయితీ (Jayamma Panchayathi) అంటూ వస్తోన్న ఈ సినిమాలో సుమ (Anchor Suma) ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. దీనికి సంబంధించి ఓ పోస్టర్‌తో పాటు టైటిల్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఆ మధ్య విడుదల చేశారు. Photo : Twitter
ఇక మరోవైపు ఈ సినిమా టైటిల్ సాంగ్ విడుదలైంది. దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli ) చేతుల మీదుగా ఈ టీజర్ విడుదలైంది. ఇందులో సుమ (Anchor Suma) చాలా ఈజ్‌తో కనిపిస్తుంది. కీరవాణి (Keeravani) ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. సుమ మినహా దాదాపు అంతా కొత్త వాళ్ళతోనే ఈ సినిమా తెరకెక్కుతోంది. పూర్తిగా హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్గా జయమ్మ పంచాయితీ (Jayamma Panchayathi) వస్తుంది. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వం వహిస్తున్నారు. Photo : Twitter