పవన్ ప్రస్తుతం ఓ వైపు ఏపీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గోంటూనే మరో వైపు వరుసగా సినిమాలు కూడా చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన ఓ నాలుగు సినిమాలు చేస్తున్నారు. అందులో రెండు రీమేక్‌లతో పాటు రెండు స్ట్రేయిట్ సినిమాలున్నాయి. అందులో ఒకటి వినోదయ సీతమ్ అనే తమిళ సినిమా రీమేక్. తమిళ్లో మంచి కంటెంట్‌తో వచ్చి మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమాను తెలుగులో సముద్రఖని దర్శకత్వంలో రీమేక్ చేస్తున్నారు. Photo : Twitter
ఈ సినిమా ఒరిజినల్లో సముద్రఖని నటించడమే కాదు ఈ సినిమాను డైరెక్ట్ కూడా చేశారు. ఇక ఇదే సినిమాను ఆయన తెలుగులో కూడా దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ్లో ఆయన చేసిన పాత్రలో పవన్ కనిపిస్తుండగా.. తంబి రామయ్య అనే మరో కీలక పాత్రలో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్నాడు. ఈ సినిమా పవన్ గతంలో నటించిన గోపాల గోపాలకు కాస్తా దగ్గరగా ఉంటుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను తాజాగా ప్రకటించారు. Photo : Twitter
ఈ చిత్రాన్ని జూలై 28న విడుదల చేస్తున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ ఇయర్ పవన్ కళ్యాణ్ నుంచి వస్తోన్నతొలి సినిమా ఇదే. మరోవైపు ఈ సినిమా విడుదలైన రెండు వారాలకు చిరు మూవీ ‘భోళా శంకర్’ మూవీ రిలీజ్ కానుంది. రెండు వారాల గ్యాప్‌తో మెగా బ్రదర్స్ బాక్సాఫీస్ బరిలో దిగుతున్నారు. ఈ నెలాఖరుకు పవన్ కళ్యాణ్ పాత్రకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ కానుంది. మరోవైపు సాయి ధరమ్ తేజ్‌తో పాటు మిగతా షూటింగ్ ఏప్రిల్ చివరకు కంప్లీట్ కానుంది. ఇక ఈ సినిమాకు టైటిల్ ను ఫిక్స్ చేశారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఈసినిమాలో దేవుడుగా కనిపించనుండడంతో ఈ సినిమాకు దేవుడు అని టైటిల్ ఫిక్స్ చేసినట్లు టాక్ నడుస్తోంది.
దాదాపుగా ఈ టైటిల్‌నే ఖరారు చేసే ఆలోచనలో ఉందట టీమ్. అతి త్వరలో ఈ విషయంలో ఓ ప్రకటన విడుదలకానుందని తెలుస్తోంది. అయితే ఈ టైటిల్‌పై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వస్తోంది. కొంత మందికి నచ్చుతుంటే.. మరికొంతమంది మాత్రం ఇదేం టైటిల్ రా బాబు అని అంటున్నారు. ఇక ఇదే టైటిల్‌తో చాలా సంవత్సరాల క్రితం బాలయ్య హీరోగా ఒక సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆ సినిమా ఫ్లాప్ కావడంతో ఈ టైటిల్ పై వద్దంటున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. Photo : Twitter
ఇక వినోదయ సీతమ్ కథ విషయానికి వస్తే.. ముఖ్యంగా సినిమా తంబి రామయ్య అనే ఒక వ్యక్తి గురించి.. ఆయన కుటుంబం గురించి.. తంబి సాఫీగా ఓ కుటుంబ పెద్దగా తన బాధ్యతలన్ని చక్కగా చూసుకుంటూ ఉంటాడు. అనుకోకుండా కారు ప్రమాదంలో చనిపోతాడు. అయితే అప్పటికీ ఆయన తన కూతురుకి పెళ్లి చేయలేదు.. కొడుకు ఇంకా సెటిల్ కాలేదు. దీంతో దేవుడైనా సముద్రఖనిని వేడుకోవడంతో ఓ మూడు నెలలు తిరిగి జీవించే అవకాశం ఇస్తాడు తంబికి. Photo : Twitter
ఈ క్రమంలో తిరిగి వచ్చిన తంబి తాను అనుకున్న పనులను చక్కబెట్టాడా.. ఈ మూడు నెలల సమయంలో కుటుంబం నుంచి ఆయన ఎదుర్కొన్న సవాళ్లు ఏంటీ.. వంటి విషయాలను ఇంట్రెస్టింగ్గా చూపించారు. ఇక ఇదే కథను కొద్దిగా మార్చి తెలుగులో చూపించనున్నారని తెలుస్తోంది. తెలుగులో ఓ ఐటెమ్ సాంగ్‌ను జోడిస్తున్నారని టాక్. పీపుల్స్ మీడియా ప్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్స్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. Photo : Twitter
ఇక ఈ సినిమాకు ఎప్పటిలాగే త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించనున్నారని టాక్.. ఈ సినిమాకు పవన్ కేవలం 15 నుండి 20 రోజుల మాత్రమే డేట్స్ కేటాయించారు. అన్ని రోజులకుగాను పవన్ కళ్యాణ్ రోజుకు రూ. 2 కోట్ల చొప్పున 25 రోజులకు గాను రూ. 50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా పూజా కార్యక్రమంలో పవన్ కళ్యాణ్‌తో పాటు సాయి ధరమ్ తేజ్, నటుడు దర్శకుడు సముద్రఖని, త్రివిక్రమ్, తమన్, ఈ సినిమా నిర్మాతలు విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల పాల్గోన్నారు. Photo : Twitter
ఇక పవన్ నటిస్తోన్న మరో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా ఇప్పటికే ఓ రెండు రోజుల పాటు షూట్ కూడా చేసిన సంగతి తెలిసిందే.. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకుడు. ఈ సినిమా తమిళ తెరీ సినిమాకు రీమేక్ అని అంటున్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమాలలో ఒకటి సుజీత్ దర్శకత్వంలో వస్తున్న సినిమా OG (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్).. సుజీత్ గతంలో రన్ రాజా రన్, సాహూ వంటి చిత్రాలను తెరకెక్కించి మంచి విజయాలను అందుకున్నారు. ఇక్కడ మరో విషయం ఏమంటే దర్శకుడు సుజీత్ స్వయంగా పవన్ కళ్యాణ్‌కి వీరాభిమాని. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరో రేంజ్లో ఉన్నాయి.. Photo : Twitter
ఈ సినిమా వినోదయ సీతమ్‌కు ముందు గ్రాండ్‌గా లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో భారీగా తెరకెక్కబోతున్న ఈ సినిమా గ్యాంగ్‌స్టర్ బ్యాక్ డ్రాప్లో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ అని అంటున్నారు. ఈ సినిమా దానయ్య నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందించనున్నారు. ఈ సినిమా మాఫియా నేపథ్యంలో తెరకెక్కనున్నట్లు టాక్ . ప్యాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న ఈ సినిమా ఓ రేంజ్లో ఉండనుందని అంటున్నారు. సుజీత్ ఓ పవర్ఫుల్ కథను రెడీ చేశారట. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉండనుందో.... Photo : Twitter
ఇక ఈ సినిమాకు రవి కె చంద్రన్ సినిమాటోగ్రాఫర్‌గా చేస్తున్నారు. రన్ రాజా రన్, సాహో చిత్రాలతో అదరగొట్టిన సుజీత్ పవన్ కోసం ఓ కొత్త కథ తయారు చేసినట్లు తెలుస్తోంది. పవన్- సుజీత్ కాంబోలో వస్తున్న ఈ సినిమా కోసం 200 కోట్ల బడ్జెట్ కేటాయించారట దానయ్య.. ఇక అది అలా ఉంటే పవన్ కళ్యాణ్ ఇటీవల అన్ని రీమేక్‌లనే చేస్తున్నాడని.. భీమ్లా నాయక్, అంతకు ముందు వచ్చిన వకీల్ సాబ్ ఇలా అన్ని వరుసగా రీమేక్‌లను చేయడం తమకు ఇష్టం లేదని అంటున్నారు ఆయన ఫ్యాన్స్. Photo : Twitter
ఇక పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ హిస్టోరియల్ మూవీ“హరిహర వీరమల్లు”. ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకుడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మొదటిసారి ఒక వారియర్ లుక్‌లో కనిపించనున్నారు. అది అలా ఉంటే ఈ సినిమా కొన్నాళ్ల పాటు షూటింగ్ జరుపుకుని ఆగిపోయింది. ఇక ఈ సినిమా షూటింగ్ విషయంలో టీమ్ మళ్ళీ దృష్టి సారించింది. భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ ప్యాన్ ఇండియా సినిమా ఇప్పటికే దాదాపు 65 శాతం మేర షూటింగ్ పూర్తి చేసుకుంది. సమ్మర్ కానుకగా హరి హర వీరమల్లు (Hari Hara Veera Mallu) చిత్రాన్ని 2023 ఏప్రిల్ 29న ఈ సినిమాను రిలీజ్ చేస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే విడుదల వాయిదా పడనుంది.ఈ సినిమా దసరాకు వస్తున్నట్లు తెలుస్తోంది. Photo : Twitter
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వజ్రాల దొంగగా కనిపించనున్నాడని అంటున్నారు. పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మొదటి పాన్ ఇండియన్ సినిమా ఇది. హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ (Nidhi Aggerwal) హీరోయిన్ గా నటిస్తుండగా కీరవాణి (Keeravani) సంగీతం అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏ యం రత్నం (AM Ratnam) నిర్మిస్తున్నారు. ఈ సినిమా పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈ సినిమా కూడా రెండు పార్టులుగా తెరకెక్కనున్నట్టు సమాచారం. ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈచిత్రం ఆడియో హక్కులను ప్రముఖ సంస్థ టిప్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. టిప్స్ సంస్థ హరిహర వీరమల్లు సినిమా ఆడియో రైట్స్‌ను భారీ ధరకు దక్కించుకుందని అంటున్నారు. Photo : Twitter
పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో పాటుస్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి అప్పట్లో అధికారిక ప్రకటన వచ్చింది. అయితే ఈ సినిమా ఆగిపోయిందని.. పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండడంతో ఈ సినిమాను చేయడం లేదని.. ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే అలాంటిదేమీ లేదని.. నిర్మాత రామ్ తాళ్లూరి మరోసారి ప్రకటించారు. Photo : Twitter