‘గబ్బర్ సింగ్’ సినిమాను ముందుగా పవన్ కళ్యాణ్ .. తన అన్నయ్య నాగబాబు ‘అంజనా ప్రొడక్షన్స్’లో చేయాలనుకున్నారు. కానీ అప్పటికే ’ఆరెంజ్’ సినిమాతో కోలుకోకుండా ఉన్న అన్నయ్య.. ఈ సినిమా ఫ్లాపైతే ఎలా అని ఆలోచించి తనతో అంతకు ముందు ‘తీన్మార్’ సినిమా చేసి చేతులు కాల్చుకున్న బండ్ల గణేష్ చేతిలో ‘గబ్బర్ సింగ్’ నిర్మాణ బాధ్యతలు పెట్టారు పవన్ కళ్యాణ్. (Twitter/Photo)
నాక్కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది.. అంటూ పవన్ తిక్కను సరిగ్గా లెక్కలేసారు దర్శకుడు హరీష్ శంకర్. ఆ తిక్క పేరు గబ్బర్ సింగ్.. ఈ సినిమా వచ్చి అప్పుడే 9 ఏళ్లవుతుంది. కాలం అంత వేగంగా వెళ్లిపోతుందా అన్నట్లుంది కదా.. మే 11, 2012న విడుదలైంది గబ్బర్ సింగ్. కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు.. మార్కెట్లో అతడి ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది లాంటి డైలాగ్స్ పవన్ కోసమే అన్నట్లుగా అతినట్టు సరిపోయాయి.. (Twitter/Photo)
అప్పట్లోనే ఈ చిత్రం రూ. 69 కోట్ల షేర్ వసూలు చేసింది. పవన్ ఇమేజ్‌తో పాటు హరీష్ శంకర్ టేకింగ్.. అంత్యాక్షరి ఎపిసోడ్.. కబడ్డి ఎపిసోడ్.. దేవీ శ్రీ ప్రసాద్ పాటలు అన్నీ వర్కవుట్ అయ్యాయి. అప్పటి వరకు వరస ప్లాపుల్లో ఉన్న పవన్ కళ్యాణ్.. ఈ చిత్రంతో బాక్సాఫీస్‌పైకి తన పంజా విసిరారు. ఈ సినిమా సక్సెస్‌తో పవన్ కళ్యాణ్ ఇమేజ్ పెరుగుతూ పోయింది. (Twitter/Photo)