ఇక అది అలా ఉంటే పవన్ ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా రణస్థలం వేదికగా జరిగిన జనసేన యువశక్తి సభలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి వెధవతో, ప్రతి సన్నాసితో మాట అనిపించుకుంటున్నాను. సినిమాల్లో ఉంటే ఈ వెధవలే వచ్చి మరీ ఫొటోలు దిగుతారని, వెధవలను, సన్నాసులను ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు. గూండాలు, రౌడీలను ఎలా తన్నాలో కూడా తెలుసంటూ హెచ్చరించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ఓటమిని గాయంగా భావించానే తప్ప పరాజయంగా కాదని, తన చివరి శ్వాస వరకూ రాజకీయాలను విడిచే ప్రసక్తే లేదని అన్నారు. ఇక ఇదే సభలో నటుడు, కమెడియన్ హైపర్ ఆది చేసిన కామెంట్స్ ప్రస్తుత సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Photo : Twitter
హైపర్ ఆది మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ నోట ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నాను.. అనే మాట వినాలని ఉందన్నారు. ఈ సందర్భంగా హైపర్ ఆది ఏపీ మంత్రులపై సెటైర్లు వేశారు. మంత్రులకు శాఖలు ఎందుకు.. పవన్‌ని తిట్టే శాఖ ఒకటి పెట్టుకోండని అన్నారు. నూటయాబై మంది ఎమ్మెల్యేలు ఒక్కడికి భయపడుతున్నారని, ప్రతివాడు తన పాపులారిటీ కోసం పవన్ కల్యాణ్‌ను విమర్శిస్తారనన్నారు. ఆది ఇంకా మాట్లాడుతూ ఇక్కడికి వచ్చినవారు ఏ బీరు బాటిలో, బిర్యానీ కోసమో రాలేదని పవన్ మీద నమ్మకంతో వచ్చారన్నారు. Photo : Twitter
హైపర్ ఆది ఇంకా మాట్లాడుతూ.. పవన్ రెండుచోట్ల ఓడిపోయాడు.. ఓడిపోయాడు అని అంటున్నారు. అరేయ్ ఓడిపోతేనే ఇంతమంది కష్టాలు, బాధలు తీర్చారు.. ఇక గెలిస్తే.. వారి కష్టం కాంపౌండ్ వాల్ కూడా దాటదు. రికార్డులు కొల్లగొట్టడానికి సినిమాలు ఒప్పుకున్న హీరోలను మీరు చూశారు.. కానీ.. కౌలు రైతుల కష్టాలను తీర్చడం కోసం సినిమా ఒప్పుకున్న హీరో పవన్ కళ్యాణ్ మాత్రమేనని.. మీరేమో వ్యాపారం చేసుకుంటూ రాజకీయాలు చేసుకోవచ్చు.. కానీ ఏ వ్యాపారం లేని ఆయన మాత్రం సినిమాలు చేసుకుంటూ రాజకీయాలు చేయకూడదా అని ప్రశ్నించారు. ప్రస్తుతం హైపర్ ఆది చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Photo : Twitter
ఇక పవన్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన వీరమల్లు షూటింగ్లో పాల్గోంటున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా తర్వాత పవన్ ఉస్తాద్ భగత్ సింగ్‌తో పాటు వినోదయ సీతం అనే మరో తమిళ సినిమా రీమేక్‌ను చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వినోదయ సీతమ్ జనవరిలో షూట్ షురూ కానుందని సమాచారం. ఇక ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా ఓ రెండు రోజుల పాటు షూట్ కూడా చేసిన సంగతి తెలిసిందే.. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకుడు. దీంతో 2023లో రెండు పవన్ కళ్యాణ్ సినిమాలు విడుదలకానున్నాయని తెలుస్తోంది. Photo : Twitter
అందులో భాగంగా టీమ్ ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ పనులను వేగవంతం చేసింది. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో కలిసి దర్శకుడు హరీష్ శంకర్ ఈ మూవీకి సంబంధించి చర్చిస్తున్న కొన్ని పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. Photo : Twitter
ఇక అది అలా ఉంటే పవన్ ఇటీవల బాలయ్య టాక్ షో ఆహా అన్ స్టాపబుల్ 2లో పాల్గోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే దీనికి సంబంధించిన షూట్ పూర్తైంది. దీంతో పవన్- బాలయ్య కలిసిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఎపిసోడ్లో పవన్‌ను బాలయ్య ఎలాంటి ప్రశ్నలు అడిగారు.. ఏమైనా పర్సనల్ విషయాలను చర్చించారా.. అంటూ చర్చలు, ఊహాగానాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. Photo : Twitter
ఇక పవన్ ఇతర సినిమాల విషయానికి వస్తే.. తెలుస్తోన్న సమాచారం మేరకు పవన్ , సుజీత్‌ల సినిమాకు మరింత సమయం అవసరం ఉండడంతో ఈ సినిమా ప్రస్తుతం వాయిదా పడనుందని తెలుస్తోంది. మొదట తెరీ, వినోదయ సీతమ్ రీమేక్ సినిమాల పూర్తి చేసుకుని.. ఆ తర్వాత సుజీత్ సినిమా మొదలు కానుందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఉస్తాద్ తమిళ తెరి సినిమాకు రీమేక్ అని అంటున్నారు. అయితే మార్పులు మాత్రం భారీగా ఉంటాయని టాక్. ఇక సుజీత్ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుండి ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈ సారి బ్లాక్ బస్టర్ హిట్ కొడుతున్నాం అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.. Photo : Twitter
ఈ సినిమా మాఫియా నేపథ్యంలో తెరకెక్కనున్నట్లు టాక్ . ప్యాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న ఈ సినిమా ఓ రేంజ్లో ఉండనుందని అంటున్నారు. సుజీత్ ఓ పవర్ఫుల్ కథను రెడీ చేశారట. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉండనుందో.. ఇక ఈ సినిమాకు తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్‌ను తీసుకోవాలంటూ మేకర్స్‌ను అభ్యర్థిస్తున్నారు పవన్ ఫ్యాన్స్. డివివి వి వాంట్ అనిరుధ్ ఫర్ ఓజి అనే ట్యాగ్‌తో ట్విట్టర్ ట్రెండ్‌ను కూడా ప్రారంభించారు. గతంలో అనిరుధ్ గతంలో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్‌ల అజ్ఞాతవాసికి సంగీతం అందించిన సంగతి తెలిసిందే.. Photo : Twitter
ఇక ఈ సినిమాకు రవి కె చంద్రన్ సినిమాటోగ్రాఫర్‌గా చేస్తున్నారు. రన్ రాజా రన్, సాహో చిత్రాలతో అదరగొట్టిన సుజీత్ పవన్ కోసం ఓ కొత్త కథ తయారు చేసినట్లు తెలుస్తోంది. పవన్- సుజీత్ కాంబోలో వస్తున్న ఈ సినిమా కోసం 200 కోట్ల బడ్జెట్ కేటాయించారట దానయ్య.. ఇక అది అలా ఉంటే పవన్ కళ్యాణ్ ఇటీవల అన్ని రీమేక్‌లనే చేస్తున్నాడని.. భీమ్లా నాయక్, అంతకు ముందు వచ్చిన వకీల్ సాబ్ ఇలా అన్ని వరుసగా రీమేక్‌లను చేయడం తమకు ఇష్టం లేదని అంటున్నారు ఆయన ఫ్యాన్స్. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా తేరి రీమేక్ అని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. దీంతో తెలుగులో రిలీజ్ అయ్యి పైగా చాలా మందికి తెలిసిన ఆ సినిమాని మళ్ళీ రీమేక్ చెయ్యడం దేనికి అంటూ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. Photo : Twitter
అంతేకాదు ఓ యాష్ ట్యాగ్‌ను మొదలు పెట్టారు. “వి డోంట్ వాంట్ తేరి రీమేక్” అంటూ స్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఈ యాష్ ట్యాగ్ ఇండియా వ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. ఇక మరో ఫ్యాన్ అయితే ఇంకా ముందుకెళ్లి.. ఓ సూసైడ్ నోట్ కూడా రాశాడు. తేరి రీమేక్ కనుక చేస్తే.. చస్తానని.. తన చావుకు మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు హరీష్ శంకర్ కూడా భాద్యత వహించాలంటూ ఉన్న ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ తేరి సినిమా పోలీసోడుగా తెలుగులో అందుబాటులో ఉంది. మరోసారి ఇలా ఎందుకు చేస్తున్నారనే వార్త ఫ్యాన్స్‌ను మరింత కుంగదీస్తుంది. Photo : Twitter
ఇక పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ హిస్టోరియల్ మూవీ“హరిహర వీరమల్లు”. ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకుడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మొదటిసారి ఒక వారియర్ లుక్‌లో కనిపించనున్నారు. అది అలా ఉంటే ఈ సినిమా కొన్నాళ్ల పాటు షూటింగ్ జరుపుకుని ఆగిపోయింది. ఇక ఈ సినిమా షూటింగ్ విషయంలో టీమ్ మళ్ళీ దృష్టి సారించింది. Photo : Twitter
అందులో భాగంగా ఈ చిత్రంలో ఇప్పుడు మేకర్స్ ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను ప్లాన్ చేస్తున్నారట. ఈ ఒక్క యాక్షన్ బ్లాక్ కోసమే సుమారు 8 నుంచి 10కోట్ల మేర మేకర్స్ ఖర్చు చేస్తున్నారట. ఈ యాక్షన్ సీన్ సినిమాలో ఓ కీలక సమయంలో రానుందని తెలుస్తోంది.. పవన్ ఇటీవల వర్క్‌షాప్‌లలో కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి కొన్ని పిక్స్ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.. Photo : Twitter
ఈ సినిమా షూటింగ్ అనేక వాయిదాల తర్వాత ఆ మధ్య మొదలైంది. భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ ప్యాన్ ఇండియా సినిమా ఇప్పటికే దాదాపు 65 శాతం మేర షూటింగ్ పూర్తి చేసుకుంది. సమ్మర్ కానుకగా హరి హర వీరమల్లు (Hari Hara Veera Mallu) చిత్రాన్ని 2023 ఏప్రిల్ 29న ఈ సినిమాను రిలీజ్ చేస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.. Photo : Twitter
మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏ యం రత్నం (AM Ratnam) నిర్మిస్తున్నారు. ఈ సినిమా పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈచిత్రం ఆడియో హక్కులను ప్రముఖ సంస్థ టిప్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. టిప్స్ సంస్థ హరిహర వీరమల్లు సినిమా ఆడియో రైట్స్‌ను భారీ ధరకు దక్కించుకుందని అంటున్నారు. Photo : Twitter
పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో పాటుస్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి అప్పట్లో అధికారిక ప్రకటన వచ్చింది. అయితే ఈ సినిమా ఆగిపోయిందని.. పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండడంతో ఈ సినిమాను చేయడం లేదని.. ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే అలాంటిదేమీ లేదని.. నిర్మాత రామ్ తాళ్లూరి మరోసారి ప్రకటించారు. Photo : Twitter
ఆయన ట్విట్టర్లో పేర్కోంటూ.. ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి, అఖిల్ అక్కినేనితో ఏజెంట్ చిత్రం చేసిన తర్వాత తమ ప్రారంభమవుతుందని నిర్మాత రామ్ ధృవీకరించారు. ఈ సినిమాకు ప్రముఖ రచయిత వక్కంతం వంశీ స్క్రిప్ట్ అందించనున్నారు. ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందనుంది. ఇక ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. Photo : Twitter
ఇక ఆ సినిమాతో పాటు తమిళ సినిమా వినోదయ సీతం తెలుగు రీమేక్‌ను చేస్తున్నారు. ఈ తెలుగు రీమేక్‌కు కూడా సముద్రఖని దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో పవన్ మేనల్లుడు, స్టార్ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారట. ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించనున్నారని టాక్.. Photo Twitter
వినోదయ సీతమ్ కథ విషయానికి వస్తే.. ఈ సినిమా పవన్ మరో సినిమా గోపాల గోపాల చిత్రానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ సినిమాలో పవన్ మరోసారి దేవుడిగా కనిపించనున్నారు. అయితే ఈ సినిమాకు ఆయన కేవలం 15 నుండి 20 రోజుల మాత్రమే డేట్స్ కేటాయించారట. అన్ని రోజులకుగాను పవన్ కళ్యాణ్ 50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. Photo : Twitter
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak). ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథనం అందించారు. ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ఇటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు ఓవర్సీస్‌లోను మంచి కలెక్షన్స్ దక్కించుకుంది. Photo : Twitter