బాలయ్య అటు రాజకీయాలు.. ఇటు సినిమాలతో దుమ్ములేపేతున్నారు అంతేకాదు.. ఓటీటీలో కూడా ఎంట్రీ ఇచ్చి అదరగొట్టారు. నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా మారి చేసిన తొలి టాక్ షో ‘అన్‌స్టాపబుల్’. ఫస్ట్ సీజన్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ టాక్ షోకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో, ఇప్పుడు రెండో సీజన్‌ను రెడీ చేశారు నిర్వాహకులు.(Twitter/Photo)
బాలయ్య షోకు పవన్ కళ్యాణ్ వస్తే... చూడాలని.. అటు పవర్ స్టార్ అభిమానులు. ఇటు బాలయ్య అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే వీరిద్దరు వేరు వేరు రాజకీయ పార్టీల్లో ఉన్నారు. ఇద్దరు కూడా రాజకీయాలు, సినిమాల్లో ఉండటంతో వీరిద్దరి మధ్య ఆసక్తికర చర్చ జరిగే అవకాశం ఉంది. Balakrishna Pawan Kalyan (Photo Twitter)
మరోవైపు పవన్ ఇలాంటి టాక్ షోలకు రావడం మట్లాడటం చాలా తక్కువ. రాజకీయంగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతుంటారు తప్పా.. ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇవ్వడం. షోలకు రావడం పవన్ పెద్దగా ఆసక్తి చూపరు. మరి ఇప్పుడు బాలయ్య టాక్ షోకు పవన్ వచ్చేందుకు సిద్ధమయ్యారన్న వార్తలతో పవన్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు బాలయ్య నటిస్తున్న వీరసింహారెడ్డి మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ షూట్ వల్ల కూడా అన్ స్టాపబుల్ షో సీజన్2 కు బ్రేకులు పడుతున్నాయని సమాచారం అందుతోంది. ఇక కొందరు ఈ షోకు వచ్చేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నా.. వారు బాలయ్య లెవల్‌కు సరిపోవడం లేదని అంటున్నారు. Balakrishna Nandamuri Unstoppalbe 2 NBK