పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu). క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎ.ఎం.రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా.. ఎప్పటికప్పుడు వస్తున్న అప్ డేట్స్ అంచనాలు పెంచుతున్నాయి.
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. మొఘల్ యువరాణి పాత్రలో నర్గీస్ ఫక్రీ నటిస్తుండగా.. పంచమి అనే పాత్రలో నిధి అగర్వాల్ కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో చివరిదశ పనులు చేస్తున్నారు మేకర్స్.