Pawan Kalyan - Hyper Aadi : హైపర్ ఆది... మెగా ఫ్యామిలీకి అందునా.. పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ ఫ్యామిలీ మీద ఈగ వాలినా.. సహించని మనస్తత్వంతో ఈయన మెగాభిమానులకు చేరువ అయ్యాడు. తాజాగా ఇతను ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలు పవన్ కళ్యాణ్‌తో పాటు తన రాజకీయ అరంగేట్రంపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. (File/Photo)
ఈ సందర్భంగా హైపర్ ఆది మాట్లాడుతూ.. తాను అప్పటికీ ఎప్పటికీ పవన్ కళ్యాణ్ అభిమానిగానే ఉంటానన్నారు. ఇక పవన్ కళ్యాణ్‌ను తాను ఎందుకు ఇష్టపడుతున్నాననే విషయమై స్పందించారు. సినీ ఇండస్ట్రీలో ఆయనలాంటి మంచి మనిషిని నేను చూడలేదున్నారు. ఇక క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న ‘హరి హర వీరమల్లు’ సినిమా కోసం చిన్న వర్క్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. (File/Photo)
ఈ సినిమాలో భాగంగా ఆయనతో పర్సనల్‌గా ఆయన ఇంటికి వెళ్లి కలిసాను. సినిమాలు, రాజకీయాల్లో ఉన్నవాళ్లను డబ్బు మార్చేస్తుందని అందరు అంటుంటారు. కానీ పవన్ కళ్యాణ్‌కు డబ్బు విషయంలో ఎలాంటి ఆసక్తి లేదున్నారు. సినిమాల కోసం ఆయన తీసుకునే పారితోషకాన్ని ఆయన రాజకీయా కార్యక్రమాల కోసం, కార్యకర్తల బాగోగులతో పాటు కౌలు రౌతులను ఆదుకోవడానికీ ఉపయోగించిన విషయాన్ని ప్రస్తావించారు. ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. అందుకే పవన్ కళ్యాణ్ అంటే తనకు ఇష్టమంటూ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని ప్రశంసించారు.(file/Photo)
సామాన్యులు, పేదలు, రైతుల మంచి కోరుకునే మంచి వెన్నలాంటి మనసతత్త్వం పవన్ కళ్యాణ్ ది. ఆయనకు భవిష్యత్తులో మంచి జరగాలని కోరుకుంటున్నాను. వచ్చే ఎన్నికల్లో జనసేన తరుపున పోటీ చేసే విషయమై హైపర్ ఆది మాట్లాడుతూ.. ఏమి లేదంటూ సమాధానం దాటవేశారు. మొత్తంగా ఇపుడు రాజకీయాల్లో వచ్చే ఉద్దేశ్యం లేదని చెప్పినా.. భవిష్యత్తులో పాలిటిక్స్‌లో ఎంట్రీ ఇచ్చినా ఆశ్యర్యపోవాల్సిన పనిలేదు. (File/Photo)