పవన్ కళ్యాణ్.. ఈ యేడాది ‘భీమ్లా నాయక్’ మూవీతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టు పలు మార్పులు చేర్పులతో తెరకెక్కించారు. త్రివిక్రమ్ మాటలు అందించిన ఈ చిత్రానికి సాగర్ చంద్ర డైరెక్ట్ చేసారు. ఈ సినిమా విజయంతో పవన్ కళ్యాణ్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ కోవలో వరుసగా తాను కమిటైన చిత్రాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ షూటింగ్లో జాయిన్ అయిన పవన్ కళ్యాణ్ త్వరలో హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయబోయే ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా షూటింగ్లో జాయిన్ కానున్నారు. (Twitter/Photo)
ఈ సందర్భంగా ‘భవదీయుడు భగత్ సింగ్’ నిర్మాతలైన మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు దర్శకుడు హరీష్ శంకర్‌తో కలిసి పవన్ కళ్యాణ్ కలిసారు. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం చేయనున్నారు. పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ ఒక నెలలో షూటింగ్ కంప్లీట్ చేసి ‘భవదీయుడు భగత్ సింగ్’ షూటింగ్లో జాయిన్ కానున్నారు. (twitter/Photo)
పవన్ కళ్యాణ్.. క్రిష్ దర్శకత్వంలో చేస్తోన్న ‘హరి హర వీరమల్లు’ తొలి చారిత్రక సినిమా. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దాదాపు రూ. 150 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ కెరీర్లో విడుదల కాబోతున్న తొలి ప్యాన్ ఇండియా మూవీ కూడా ఇదే. గతంలో ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సినిమాను కేవలం తెలుగుతో పాటు హిందీలో డబ్ చేసి ఒకేసారి విడుదల చేసారు. ‘భీమ్లా నాయక్’ మూవీని హిందీలో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ విడుదల చేయలేదు. (Twitter/Photo)
పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా పవన్ కళ్యాణ్ బైక్ పై కూర్చొని .. బ్యారెల్ గన్ను లోడ్ చేస్తున్న పవన్ కళ్యాణ్ ప్రీ లుక్‌ను విడుదల చేసారు. ఆ తర్వాత టైటిల్ ‘భవదీయుడు భగత్ సింగ్’ అంటూ ఈ సినిమా టైటిల్ రివీల్ చేశారు. ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ సమకాలీన రాజకీయాల అంశాలతో పాటు దేశభక్తి నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో డైలాగ్స్, సన్నివేశాలు పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితానికి ఉపయోగపడేలా ఈ సినిమా స్క్రిప్ట్‌ను హరీష్ శంకర్ తీర్చిదిద్దినట్టు సమాచారం. మొత్తంగా తన నిజ జీవిత పాత్రను తెరపై చేయనున్నడన్న మాట. (Twitter/Photo)
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక లెక్చరర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎందుకు మారాడనేదే ఈ సినిమా స్టోరీ. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన పూజా హెగ్డే కథానాయికగా ఎంపిక చేశారు.మరోవైపు ఈ చిత్రంలో ప్రియమణి మరో కథానాయికగా యాక్ట్ చేయనున్నట్టు సమాచారం. .. హరీష్ శంకర్.. ‘డీజే’ (దువ్వాడ జగన్నాథం), సినిమాతో పాటు గద్దలకొండ గణేష్ సినిమాల్లో నటించింది. ఇపుడు ముచ్చటగా హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తోన్న మూడో చిత్రంలో పూజా హెగ్డే.. పవన్ కళ్యాణ్ సరసన నటిస్తోంది. (Twitter/Photo)
ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్‌లో పవన్ కళ్యాణ్ లెక్చరర్‌గా కనిపించనున్నాడు.ఆ తర్వాత పరిస్థితులు కారణంగా రాజకీయాల్లో ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనేదే ఈ సినిమా స్టోరీ. అంతేకాదు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తండ్రీ కొడుకులుగా నటించబోతున్నట్టు సమాచారం. ఒకటి కాలేజీ లెక్చరర్ పాత్ర అయితే.. మరోకటి ఐబీ ఆఫీసర్. ఈ సినిమా కోసం ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి నేతృత్వంలో కాలేజ్ సెట్ పనులు పూర్తైయినట్టు సమాచారం. (Twitter/Photo)