మరోవైపు తమిళ సూపర్ హిట్ మూవీ ‘వినోదయ సీతం’ (Vinodaya sittam) సినిమా తెలుగు రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారనే బయటకొచ్చింది. ఈ మూవీలో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్క్రీన్ షేర్ చేసుకుంటారని తెలుస్తుండటం ఆసక్తికరంగా మారింది. అయితే పవన్ బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ రెండు సినిమాలు ఆగిపోయాయని అన్నారు.
మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా తన లైనప్ సినిమాల కోసం పర్ఫెక్ట్ ప్లాన్ చేసుకున్నారని సమాచారం. సుజీత్ తో సినిమా చేస్తూనే హరీష్ శంకర్ తో చేస్తున్న భవదీయుడు భగత్ సింగ్ కంప్లీట్ చేయాలని ఫిక్సయ్యారట. అలాగే వినోదయ సీతం రీమేక్ కూడా ఫినిష్ చేయాలని స్కెచ్చేశారట. 2024 ఎన్నికలలోపు ఈ మూడు సినిమాలు పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నట్లు టాక్.