ఏఎం రత్నం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్ కానున్నాయట. బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అన్ని హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట. అయితే నేడు (ఫిబ్రవరి 4) ఏఎం రత్నం పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు బెస్ట్ విషెస్ చెబుతూ హరిహర వీరమల్లు సెట్స్‌పై తీసిన కొన్ని ఫొటోస్ షేర్ చేసింది చిత్రయూనిట్.