Bheemla Nayak Director Saagar K Chandra : సాగర్ కే చంద్ర ఈ పేరు పవన్ కళ్యాణ్‌తో ‘భీమ్లా నాయక్’ చేసే వరకు ఎవరికీ పెద్దగా తెలియదు. అంతగా ఫామ్‌లోని ఈ దర్శకుడికి పవన్ కళ్యాణ్ పిలిచి మరి తన సినిమాను అతని చేతిలో పెట్టారు. పెద్ద హీరోలను డీల్ చేయని ఓ కుర్ర దర్శకుడి చేతిలో పవన్ కళ్యాణ్ తన సినిమాను పెట్టడం హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఈ సాగర్ చంద్ర ఎవరు.. ఎవరి దగ్గర పనిచేసి పవన్ కళ్యాణ్‌తో పనిచేసే ఛాన్స్ ఎలా పట్టారు. (Twitter/Photo)
‘భీమ్లా నాయక్’ సినిమాతో ఒక్కసారిగా అందరు ఈ దర్శకుడు సాగర్ కే చంద్ర గురించి మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను తన టాలెంట్‌తో ఆకట్టుకోవడమే కాదు ఏకంగా ఆయన్ని డైరెక్ట్ చేసే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసారు. ఒక వేళ భీమ్లా నాయక్ బ్లాక్ బస్టర్ అయితే.. మాత్రం దర్శకుడిగా సాగర్ చంద్ర బిజీ అవ్వడం ఖాయం అనే చెప్పాలి. (Twitter/Photo)
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన సాగర్ కే చంద్ర కూడా చాలా మంది దర్శకుల మాదిరే గ్రాడ్యూయేషన్ పూర్తైన తర్వాత ప్రముఖ దర్శకుడు నటుడు రవి బాబు దగ్గర మరో ఇద్దరు ముగ్గురు దర్శకులు దగ్గర పలు చిత్రాలకు అసిస్టెంట్‌గా పనిచేసారు. ఆ తర్వాత 2012లో రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘అయ్యారే’ చిత్రంతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకున్నారు. (Twitter/Photo)
మొత్తంగా ‘భీమ్లా నాయక్’ సినిమాలో త్రివిక్రమ్ మార్క్ కాకుండా.. సాగర్ కే చంద్ర తనదైన మార్క్ ఏమైనా చూపించారా అనే దానిపైనే ఈ దర్శకుడి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఆధారపడి ఉన్నాయి. గతంలో పవన్ కళ్యాణ్‌తో ‘వకీల్ సాబ్’ సినిమా తెరకెక్కించిన శ్రీరామ్ వేణుకు దర్శకుడిగా ఏ మాత్రం క్రెడిట్ దక్కించుకోలేకపోయారు. (Twitter/Photo)