మెగా హీరోలకు నైజాం మార్కెట్ అనేది ఎప్పుడూ పెట్టని కోటగానే ఉంది. చిరంజీవి నుంచి నిన్నగాక మొన్నొచ్చిన వరుణ్ తేజ్ వరకు అంతా నైజాం మార్కెట్లో రచ్చ చేసిన వాళ్లే. పైగా వాళ్ల సినిమాలకు టాక్తో పని లేకుండా ఇక్కడ వసూళ్ల వర్షం కురుస్తుంటుంది. తాజాగా పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ కూడా ఇదే చేసింది. ఈ సినిమా తొలిరోజు నైజాంలో సరికొత్త చరిత్రకు తెరతీసింది.
ఇప్పటి వరకు మరే తెలుగు సినిమాకు సాధ్యం కాని స్థాయిలో రచ్చ చేసింది. బాహుబలి 2 పేరు మీదున్న రికార్డులను పుష్ప తుడిచేస్తే.. ఇప్పుడు పుష్ప రికార్డులను భీమ్లా తుడిచేసాడు. నైజాంలో మొదటి రోజే 11.85 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది భీమ్లా నాయక్. మరి నైజాంలో మొదటి రోజు అత్యధిక షేర్ వసూలు చేసిన సినిమాలేంటో చూద్దాం..