పవన్ ప్రస్తుతం వీరమల్లు షూటింగ్లో పాల్గోంటున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా తర్వాత పవన్ ఉస్తాద్ భగత్ సింగ్‌తో పాటు వినోదయ సీతం అనే మరో తమిళ సినిమా రీమేక్‌ను చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వినోదయ సీతమ్ జనవరిలో షూట్ షురూ కానుందని సమాచారం. ఇక ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా ఓ రెండు రోజుల పాటు షూట్ కూడా చేసిన సంగతి తెలిసిందే.. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకుడు. దీంతో 2023లో రెండు పవన్ కళ్యాణ్ సినిమాలు విడుదలకానున్నాయని తెలుస్తోంది. Photo : Twitter
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమాలలో ఒకటి సుజీత్ దర్శకత్వంలో వస్తున్న సినిమా OG.. సుజీత్ గతంలో రన్ రాజా రన్, సాహూ వంటి చిత్రాలను తెరకెక్కించి మంచి విజయాలను అందుకున్నారు. ఇక్కడ మరో విషయం ఏమంటే దర్శకుడు సుజీత్ స్వయంగా పవన్ కళ్యాణ్‌కి వీరాభిమాని. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరో రేంజ్లో ఉన్నాయి. ఇక ఈ సినిమా ఎప్పుడు ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఓ గుడ్ న్యూ్స్.. Photo : Twitter
ఈ సినిమా ఈనెల 30న గ్రాండ్‌గా లాంఛ్ కానుందని తెలుస్తోంది. ఇక అదే రోజు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, విలన్ ఎవరు, ఇతర టెక్నికల్ విషయాలను ప్రకటించనుంది టీమ్. పాన్ ఇండియా స్థాయిలో భారీగా తెరకెక్కబోతున్న ఈ సినిమా గ్యాంగ్‌స్టర్ బ్యాక్ డ్రాప్లో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ అని అంటున్నారు. Photo : Twitter
ఈ సినిమా మాఫియా నేపథ్యంలో తెరకెక్కనున్నట్లు టాక్ . ప్యాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న ఈ సినిమా ఓ రేంజ్లో ఉండనుందని అంటున్నారు. సుజీత్ ఓ పవర్ఫుల్ కథను రెడీ చేశారట. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉండనుందో.. ఇక ఈ సినిమాకు తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్‌ను తీసుకోవాలంటూ మేకర్స్‌ను అభ్యర్థిస్తున్నారు పవన్ ఫ్యాన్స్. డివివి వి వాంట్ అనిరుధ్ ఫర్ ఓజి అనే ట్యాగ్‌తో ట్విట్టర్ ట్రెండ్‌ను కూడా ప్రారంభించారు. గతంలో అనిరుధ్ గతంలో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్‌ల అజ్ఞాతవాసికి సంగీతం అందించిన సంగతి తెలిసిందే.. Photo : Twitter
ఇక ఈ సినిమాకు రవి కె చంద్రన్ సినిమాటోగ్రాఫర్‌గా చేస్తున్నారు. రన్ రాజా రన్, సాహో చిత్రాలతో అదరగొట్టిన సుజీత్ పవన్ కోసం ఓ కొత్త కథ తయారు చేసినట్లు తెలుస్తోంది. పవన్- సుజీత్ కాంబోలో వస్తున్న ఈ సినిమా కోసం 200 కోట్ల బడ్జెట్ కేటాయించారట దానయ్య.. ఇక అది అలా ఉంటే పవన్ కళ్యాణ్ ఇటీవల అన్ని రీమేక్‌లనే చేస్తున్నాడని.. భీమ్లా నాయక్, అంతకు ముందు వచ్చిన వకీల్ సాబ్ ఇలా అన్ని వరుసగా రీమేక్‌లను చేయడం తమకు ఇష్టం లేదని అంటున్నారు ఆయన ఫ్యాన్స్. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా తేరి రీమేక్ అని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. దీంతో తెలుగులో రిలీజ్ అయ్యి పైగా చాలా మందికి తెలిసిన ఆ సినిమాని మళ్ళీ రీమేక్ చెయ్యడం దేనికి అంటూ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. Photo : Twitter
ఇక పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ హిస్టోరియల్ మూవీ“హరిహర వీరమల్లు”. ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకుడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మొదటిసారి ఒక వారియర్ లుక్‌లో కనిపించనున్నారు. అది అలా ఉంటే ఈ సినిమా కొన్నాళ్ల పాటు షూటింగ్ జరుపుకుని ఆగిపోయింది. ఇక ఈ సినిమా షూటింగ్ విషయంలో టీమ్ మళ్ళీ దృష్టి సారించింది. Photo : Twitter
ఈ సినిమా షూటింగ్ అనేక వాయిదాల తర్వాత ఆ మధ్య మొదలైంది. భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ ప్యాన్ ఇండియా సినిమా ఇప్పటికే దాదాపు 65 శాతం మేర షూటింగ్ పూర్తి చేసుకుంది. సమ్మర్ కానుకగా హరి హర వీరమల్లు (Hari Hara Veera Mallu) చిత్రాన్ని 2023 ఏప్రిల్ 29న ఈ సినిమాను రిలీజ్ చేస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.. Photo : Twitter
మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏ యం రత్నం (AM Ratnam) నిర్మిస్తున్నారు. ఈ సినిమా పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈచిత్రం ఆడియో హక్కులను ప్రముఖ సంస్థ టిప్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. టిప్స్ సంస్థ హరిహర వీరమల్లు సినిమా ఆడియో రైట్స్‌ను భారీ ధరకు దక్కించుకుందని అంటున్నారు. Photo : Twitter
పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో పాటుస్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి అప్పట్లో అధికారిక ప్రకటన వచ్చింది. అయితే ఈ సినిమా ఆగిపోయిందని.. పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండడంతో ఈ సినిమాను చేయడం లేదని.. ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే అలాంటిదేమీ లేదని.. నిర్మాత రామ్ తాళ్లూరి మరోసారి ప్రకటించారు. Photo : Twitter
ఇక ఆ సినిమాతో పాటు తమిళ సినిమా వినోదయ సీతం తెలుగు రీమేక్‌ను చేస్తున్నారు. ఈ తెలుగు రీమేక్‌కు కూడా సముద్రఖని దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో పవన్ మేనల్లుడు, స్టార్ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారట. ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించనున్నారని టాక్.. Photo Twitter
వినోదయ సీతమ్ కథ విషయానికి వస్తే.. ఈ సినిమా పవన్ మరో సినిమా గోపాల గోపాల చిత్రానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ సినిమాలో పవన్ మరోసారి దేవుడిగా కనిపించనున్నారు. అయితే ఈ సినిమాకు ఆయన కేవలం 15 నుండి 20 రోజుల మాత్రమే డేట్స్ కేటాయించారట. అన్ని రోజులకుగాను పవన్ కళ్యాణ్ 50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. Photo : Twitter
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak). ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథనం అందించారు. ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ఇటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు ఓవర్సీస్‌లోను మంచి కలెక్షన్స్ దక్కించుకుంది. Photo : Twitter