మరోవైపు అకీరా నందన్ ఆన్ స్క్రీన్ ఎంట్రీ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు పవన్ ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ తనయుడు కూడా లాంఛ్ చేయడానికి సిద్ధంగా ఉన్న మిసైల్‌లా ఉన్నాడు. ఇప్పటికే ఆరున్నర అడుగులున్న అకీరాను చూసి ఆగలేకపోతున్నారు అభిమానులు. వీలైనంత త్వరగా జూనియర్ పవర్ స్టార్‌ను స్క్రీన్ పై చూడాలని తహతహలాడుతున్నారు.