కన్నడ నటిగా పేరుతెచ్చుకున్నా పవిత్రా లోకేష్ తెలుగులో కూడా అనేక సినిమాల్లో నటించింది. టాలీవుడ్ లోనే.. స్టార్ హీరో హీరోయిన్లకు తల్లిగా, అత్తగా ఆమె నటించి మెప్పించింది. ఇక గత కొన్ని రోజులుగా పవిత్రా లోకేష్ సీనియర్ నటుడు నరేష్ తో లివింగ్ రిలేషన్ లో ఉందని, త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి.
అంతేకాదు నరేష్ మూడో భార్య రమ్య రఘుపతిపై కూడా పవిత్రా ఆసక్తికర వ్యాఖ్లయు చేశారు. రమ్య సరిగ్గా ఉంటే.. నరేష్ కుటుంబం ఆమె వెంట ఉండేదన్నారు. ఆమెను తాను దూరంగా ఉండి చూశానని.. ఆమె తీరు, ప్రవర్తన తనకు ఏమాత్రం నచ్చలేదన్నారు. ఆమె తన భర్తతో కలిసి ఉండనని చెప్పిందన్నారు. అలా ఆమె జీవితంలో సమస్యలు తలెత్తాయన్నారు.